గుంటూరులో పార్టీ ఆఫీసుపై రాళ్లదాడి టీడీపీ గూండాల పనే.. వదిలేప్రసక్తే లేదు.. విడుదల రజిని

Published : Jan 01, 2024, 09:19 AM ISTUpdated : Jan 01, 2024, 11:01 AM IST
గుంటూరులో పార్టీ ఆఫీసుపై  రాళ్లదాడి టీడీపీ గూండాల పనే.. వదిలేప్రసక్తే లేదు.. విడుదల రజిని

సారాంశం

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఇటీవలే మంత్రి విడుదల రజిని నియమితులయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల రజని కొత్త ఆఫీసు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. 

గుంటూరు : కొత్త సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.  ఆదివారం అర్ధరాత్రి గుంటూరులో మంత్రి విడుదల రజని ఆఫీసు ముందు ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని విద్యానగర్లో కొత్తగా ప్రారంభించబోయే పార్టీ ఆఫీసుపై టిడిపి-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీసులోని అద్దాలు ధ్వంసం అయ్యాయి.  న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా టిడిపి-జనసేన కార్యకర్తలు అటు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ  సమయంలో కొంతమంది రజిని ఆఫీసుపై రాళ్లతో దాడికి దిగారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు.

దాడికి పాల్పడ్డ కొంతమంది టిడిపి-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీనిమీద విడుదల రజని స్పందిస్తూ.. కావాలనే ఈ దాడికి దిగినట్లుగా తెలుస్తుందని అన్నారు. దానికి పాల్పడ్డవారు ఎవరైనా సరే వదిలేది లేదన్నారు. అద్దాలు పగలగొట్టిన రాళ్లను చూపిస్తూ ఇంత పెద్ద రాళ్ళు ఎక్కడినుండి వస్తాయంటూ ప్రశ్నించారు. ముందుగానే పకడ్బందీగా  దాడి చేయాలని ఉద్దేశంతోనే వచ్చారని చెప్పుకొచ్చారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి విడుదల రజని కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

New Year Celebrations: తెలుగువారికి ప్రముఖుల శుభాకాంక్షలు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఇటీవలే మంత్రి విడుదల రజిని నియమితులయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల రజని కొత్త ఆఫీసు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్యాలయానికి దగ్గరలోనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి - జనసేన కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఆ తరువాత ర్యాలీ తీసిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu