జైలు నుంచి విడుదలైన ధూళిపాళ్ల నరేంద్ర.. నెల రోజులు బెజవాడకే పరిమితం

By Siva KodatiFirst Published May 25, 2021, 7:34 PM IST
Highlights

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత, సంగం డెయిరీ మాజీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విడుదలయ్యారు. ఆయనతో పాటు డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా విడుదలయ్యారు. నెల రోజుల పాటు విజయవాడలోనే వుండాలని నరేంద్రకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ నేత, సంగం డెయిరీ మాజీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విడుదలయ్యారు. ఆయనతో పాటు డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా విడుదలయ్యారు. నెల రోజుల పాటు విజయవాడలోనే వుండాలని నరేంద్రకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

కాగా, ధూళిపాళ్లతో పాటు గోపాలకృష్ణన్‌లకు షరతులతో కూడిన బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ విడిచి వెళ్లకూడదని హైకోర్టు ధూళిపాళ్లను ఆదేశించింది. అలాగే ఏసీబీ విచారణకు సహకరించాలని కూడా సూచించింది. ధూళిపాళ్ల విచారణకు 24 గంటల ముందు నోటీసు ఇవ్వాలని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. 

Also Read:సంగం డెయిరీ కేసులో అరెస్టు: ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట

సంగం డెయిరీ కేసులో దూళిపాళ్ల నరేంద్రతో పాటు గోపాలకృష్ణన్ అరెస్టయిన విషయం తెలిసిందే. సంగం డెయిరీ కేసులో ఏసీబీ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను ఏప్రిల్ 23వ తేదీన అరెస్టు చేసారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 

కాగా, జైలులో వున్న సమయంలో నరేంద్రకు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. అయితే గత బుధవారం కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో నరేంద్రను తిరిగి సెంట్రల్ జైలుకు తరలించారు. వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు నరేంద్రకు విజ్ఞప్తి చేశారు. 

click me!