ఆనందయ్య మందు: తిరుపతి ఆయుర్వేద కళాశాలలో పరిశోధన వేగవంతం.. రాత్రికి నివేదిక

By Siva Kodati  |  First Published May 25, 2021, 6:54 PM IST

ఆనందయ్య మందుపై పరిశోధన వేగవంతం చేశారు తిరుపతి ఆయుర్వేద ఆసుపత్రి పరిశోధకులు. 18 మంది డాక్టర్లు, 32 మంది పీజీ విద్యార్ధులతో పరిశోధన చేస్తున్నారు. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు మందు వేసుకున్న 500 మంది వివరాలు సేకరించారు. విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధన జరుగుతోంది. ఇవాళ రాత్రికి సీసీఆర్ఏఎస్‌కి పరిశోధనా నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు. 

మరోవైపు నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందుపై   జాతీయ ఆయుర్వేద సంస్థ రెండో రోజూ  పరిశోధన చేస్తోంది. కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే సుమారు 60 వేలకు పైగా మందికి తాను తయారు చేసిన మందును అందించాడు. ఈ మందును తీసుకొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు ఆయుర్వేద పరిశోధన సంస్థ బృందం.ఆనందయ్య మందు తీసుకొన్న 500 మంది సమాచారం తీసుకొని వారి నుండి డేటాను సేకరిస్తున్నారు.  

Latest Videos

undefined

Also Read:ఆనందయ్య మందు పంపిణీ: రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

ఈ మందు తీసుకోకముందు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది, మందు తీసుకొన్న తర్వాత పరిస్థితి ఎలా ఉందనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు. సోమవారం నాడు 190 మంది నుండి సమాచారాన్ని సేకరించారు. స్థానికంగా ఉన్న ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వశాఖల అధికారుల నుండి ఆనందయ్య నుండి  మందును తీసుకొన్న వారి వివరాలను  సీసీఆర్ఏఎస్  సేకరిస్తోంది.

click me!