ఓవర్ యాక్షన్ చేస్తే.......డిజిపి

Published : Jan 07, 2017, 06:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఓవర్ యాక్షన్ చేస్తే.......డిజిపి

సారాంశం

బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఒకేసారి రిలీజవుతున్నాయి.

అభిమానులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి)సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీసేస్తానని పోలీసులు హెచ్చరించటం గమనార్హం. అభిమానులకు డిజిపి హెచ్చరికలు జారీ చేయటానికి కారణాలున్నాయి లేండి.

 

సంక్రాంతి పండుగకు ఇద్దరు అగ్రహీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఒకేసారి రిలీజవుతున్నాయి.

 

ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజవుతుండటంతో అభిమానులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నానా హంగామా చేస్తున్నారు. అందులోనూ కాపు సామాజిక వర్గం ఎక్కువుండే కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చిరంజీవి అభిమానులు హడావుడి ఎక్కువగా ఉంది.

 

ఇక, బాలయ్య నటించిన శాతకర్ణి సినిమాకు గుంటూరు, కృష్ణ ప్రత్యేకించి రాజధాని ప్రాంతమైన విజయవాడ అభిబామనుల కోలాహలానికి కేంద్రంగా మారింది.

 

దానికితోడు తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవి నటించటం, బాలయ్యకు 100వ సినిమా కావటంతో రెండు సినిమాలు కూడా ప్రతిష్టాత్మకంగానే తెరకెక్కాయి. రిలీజైతే కానీ ఏ  సినిమా ఎలావుంటుందో తెలీదు కాబట్టి ఇప్పటి నుండే అభిమానుల హంగామా మొదలైపోయింది.

 

గతంలో కూడా పవన్ కల్యాణ్, ప్రభాస్ సినిమాల రిలీజ్ నేపధ్యంలో కాకినాడ తదితర ప్రాంతాల్లో వారి అభిమానులు పోస్టర్లు చించేయటం, ఫ్లెక్సీలు చించేయటంతో పెద్ద గొడవైంది. తీవ్రంగా కొట్టుకున్న ఘటనల్లో ఇద్దరు అభిమానులు మృతిచెందారు.

 

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే డిజిపి సాంబశివరావు అభిమానులకు హెచ్చరికలు జారీ చేసారు. ఉద్దేశ్యపూర్వకంగానే చిరంజీవి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభుత్వం వేదికను కేటాయించలేదని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం జరిగింది.

 

దానికి తోడు బాలకృష్ణ స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బావమరది కమ్ వియ్యంకుడు కూడా కావటంతో అభిమానుల,  టిడిపి శ్రేణుల సందడి గురించి ఇక చెప్పేదేముంది.

 

అందుకనే డిజిపి స్వయంగా అభిమానులకు హెచ్చరికలు జారీ చేసారు. పండగ పూట హాయిగా కుటుంబసభ్యులతో గడపమన్నారు. సినిమాను సినిమాగానే ఆస్వాధించాలని హితవు పలికారు.

 

సోషల్ మీడియాలో సినిమాలపై పిచ్చి పోస్టింగులు పెట్టటం, పోస్టర్లు, ఫ్లెక్సీలు చించేటయం లాంటివి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని చెప్పారు. అభిమానుల ముసుగులో ఎవరు కూడా ఎటువంటి వివాదాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేయటం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?