నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: గుంటూరు రేంజ్ ఐజీ, అడిషనల్ ఎస్పీ విచారణ

By narsimha lodeFirst Published Nov 8, 2020, 2:18 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలోని నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై గుంటూరు ఐజీ, అదనపు ఎస్పీ విచారణ చేస్తున్నారు.


నంద్యాల: కర్నూల్ జిల్లాలోని నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై గుంటూరు ఐజీ, అదనపు ఎస్పీ విచారణ చేస్తున్నారు.

ఈ నెల 3వ తేదీన రన్నింగ్ ట్రైన్ కు ఎదురెళ్లి  తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సలాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆత్మహత్యకు ముందు  సలాం కుటుంబం సెల్పీ వీడియో తీసుకొంది.

ఏడాది క్రితం జ్యూయలరీ షాపులో జరిగిన దొంగతనం కేసులో సలాంను అన్యాయంగా ఇరికించారని సలాం అత్త ఆరోపించారు. ఈ కేసులో  బెయిల్ పై విడుదలైన తర్వాత ఆటో నడుపుకొంటూ జీవిస్తున్న సలాం ను సీఐ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

also read:రైలు కింద పడి నలుగురు ఆత్మహత్య: కంటతడి పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో

ఆటోలో ప్రయాణీస్తున్న ఓ వ్యక్తికి చెందిన రూ. 70వేలు చోరీకి సలాం కారణమంటూ సీఐ కేసు నమోదు చేశాడని ఆమె చెప్పారు. సీఐ వేధింపులు భరించలేక సలాం కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు.

సీఐ అసభ్యంగా మాట్లాడడం, దూషించడం వంటి కారణాలతో సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన సీఐని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ విషయమై గుంటూరు రేంజ్ ఐజీ, గుంటూరు అదనపు ఎస్పీ విచారణ చేస్తున్నారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న  సీఐ సోమశేఖర్ రెడ్డిని  సస్పెండ్ చేశారు. 

click me!