టిడిపి నేతలందరికీ ఖైదీ నంబర్లు..: దేవినేని ఉమ సంచలనం

By Arun Kumar PFirst Published Jun 23, 2020, 8:27 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నాయకులపై వరుస కేసులు, అరెస్టులపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విజయవాడ: త్వరలో టీడీపీ నేతలందరికీ తలా ఒక ఖైదీ నంబరు ఇస్తారా? అంటూ వైసిపి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.  విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైందని... అది ఇంకా కొనసాగుతూనే వుందన్నారు. టిడిపి నాయకులపై కక్ష్యపూరితంగా టార్గెట్ చేసి మరీ అక్రమ కేసులు బనాయిస్తున్నారని... ఇలా ఇప్పటికే కొందరు నాయకులను అరెస్ట్ కూడా చేయడం జరిగిందని ఉమ ఆరోపించారు.

''ఇక కరోనా విషయంలోనూ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని... ఈ విషయంలో ఆరోగ్య శాఖామంత్రి వాస్తవాలు చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకుని హైకోర్టు ధర్మాన్ని కాపాడుతున్నది'' అని పేర్కొన్నారు. 

''పార్క్ హయత్ సీసీ కెమెరాల‌ గురించి మాట్లాడటం అసమర్ధ రాజకీయం. చేతకాక అసమర్ధ ప్రేలాపనలే సీసీ కెమెరాల తంతు. ప్రభుత్వ అవినీతిని పట్టాభి చూపించడంతో పోలీసులను పంపి బెదిరించారు. ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేస్తే కేసులు పెట్టారు. పరిపాలన చేతకాక ఈ ప్రభుత్వం దాడులు చేస్తోంది. గంటా నవీన్ ను చంపి రెండుసార్లు పాతిపెట్టారు. రెండు రోజుల్లో పోలీసు కమీషనర్ ను కలుసి వీటన్నింటిపై ఫిర్యాదు చేస్తాం'' అని దేవినేని ఉమ వెల్లడించారు. 

read more  చిప్పకూడు తినడం జగన్ రెడ్డి లక్షణం: మాజీ మంత్రి జవహర్ ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారని మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 108 అంబులెన్స్ ల వ్యవహారాన్ని బయటపెట్టిన పట్టాభిపైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ఆరోపింంచారు. 

అసెంబ్లీలో నిలదీస్తున్నారనే అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టారని...టీడీపీ నేతలపైన, సోషల్ మీడియాపైన కేసులు పెడుతూ అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు పాలన జరుగుతోందని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డే స్వయంగా చెప్పారని అన్నారు. వార్డ్ ఇంఛార్జులు ఎందుకని... అధికారులు ఏమైపోయారని రవీంద్ర నిలదీశారు. 
 

click me!