కరీంనగర్ జిల్లాలో మళ్లీ కరోనా... ఒకే గ్రామంలో నలుగురికి పాజిటివ్

By Arun Kumar PFirst Published Jun 23, 2020, 8:03 PM IST
Highlights

కరీంనగర్ జిల్లాలో మళ్లీ  కరోనా కలకలం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్కడో ఒకచోట రోజూ కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. 

కరీంనగర్ జిల్లాలో మళ్లీ  కరోనా కలకలం రేపుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్కడో ఒకచోట  రోజూ కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా ఇళ్ళంతకుంట మండలం మాల్యాల గ్రామంలో కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ చిన్న గ్రామంలో ఏకంగా నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో పడ్డారు. 
 
కరీంనగర్ నగరంలో శనివారం ఒక్కరోజే 13 కేసులు నమోదయ్యాయి. బ్యాంక్ ఉద్యోగులకు, వారితో కాంటాక్ట్ అయిన చిట్ ఫండ్ ఉద్యోగులకూ ఇది కరోనా సోకింది. ఆరంభంలో కరోనా కేసులు బయటపడ్డ సమయంలో సమర్ధవంతంగా ఎదుర్కొన్న అధికారులు లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఆ స్థాయిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలను, కరోనా నిబంధనలను పాటించడం లేదు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. 

read more   కరోనా రోగుల డెడ్‌బాడీల మాయం: దర్యాప్తుకు సీపీ అంజనీకుమార్ ఆదేశం

మొత్తంగా తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. సోమవారం ఒక్క రోజే 872 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 8,674కి చేరింది. సోమవారం వైరస్ కారణంగా ఏడుగురు మరణించడంతో... మొత్తం మృతుల సంఖ్య 217కి చేరుకుంది.

రాష్ట్రంలో 4,452 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 4,005 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఒక్క హైదరాబాద్‌లోనే 713 మంది కోవిడ్ 19 బారినపడ్డారు. ఆ తర్వాత రంగారెడ్డి 107, మేడ్చల్ 16, మంచిర్యాల 5, సంగారెడ్డి 12, వరంగల్ అర్బన్ 1, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్‌లలో రెండేసి చొప్పున, కామారెడ్డి, మెదక్‌లలో మూడేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 


 

click me!