వైసిసి ఎమ్మెల్యే బుగ్గనకు నిద్ర పట్టడం లేదా?

Published : Sep 15, 2017, 08:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
వైసిసి ఎమ్మెల్యే బుగ్గనకు నిద్ర పట్టడం లేదా?

సారాంశం

డోన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరిగి తమ చేతిలోకి తెచ్చుకునేందుకు  ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వ్యూహం పన్నారు

పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి  వచ్చే ఎన్నికలను తలుచుకుంటే నిద్రపడుతున్నట్లు లేని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. బుగ్గున  2014లో వైసిపితరఫున కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.డోన్ నియోజకవర్గానికి అంతకు ముందు చాలాసార్లు కెయి ప్రాతినిధ్యం వహించారు.డోన్ నియోజకవర్గం ఎపుడూ అటు కెయి కుటుంబంతోనో లేదా కోట్ల కుటంబంతోనో ఉండేది. ఇతరుల చేతిలోకి మారింది బాగా తక్కువ.  ఇపుడు ఈ నియోజకవర్గం బుగ్గన లాక్కుపోయాడు. 2019లో దీనిని వెనక్కి లాక్కునేందుకు కెఇ కుటుంబం ప్రయత్నం చేస్తుంది.  తమ్ముడు కెయి ప్రభాకర్ గాని, కొడుకుగాని పోటీచేయవచు. ఇలాంటి వూహాగానాల మధ్య కెయి బుగ్గన గురించి ఆసక్తికరమయిన వ్యాఖ్యాలు చేశారు.

 

ఏమాటకామాటే చెప్పుకోవాలి. మొదటి దఫా ఎమ్మెల్యేలలో బుగ్గన ఒక మంచి ఉపన్యాసకుడుగా పేరు తెచ్చకున్నారు.   చాలా యాక్టివ్ ఎమ్యెల్యేగా పేరొచ్చింది. వైసిపికి ఆయన ఒక అసెట్ అని కూడా చెబుతారు.

‘ నేనంటే భయం పట్టుకున్నట్లుంది బుగ్గనకు,’ అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

‘‘బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి నన్ను విమర్శించే స్థాయి లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గం నుంచే 5సార్లు, ఒకసారి పత్తికొండ నుంచి మొత్తం 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నాను. నేను మళ్లీ ఎక్కడ డోన్ నుంచి పోటీ చేస్తా నని, బుగ్గనకు నిద్రపట్టనట్టుగా ఉంది. తాను డోన్ నుంచి పోటీ చేసినా చేయకపోయినా ఆయన మాత్రం వచ్చే ఎన్నికల తరువాత పేరుకు ముందు మాజీ ఎమ్మెల్యే అని పెట్టుకోవాల్సిందే,’ అని ధీమా వ్యక్తం చేశారు.

 పిఎసి చైర్మన్‌గా బుగ్గన తీరు బాగా లేదని కూడా కెయి అన్నారు.

 ‘ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సూచనలు చేయాల్సంది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబుని, లోకేష్‌ని విమర్శించడమే బుగ్గన ఎజెండాగా పెట్టుకున్నారు. బహుశా పిఎసి చైర్మన్ ఇచ్చే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించడానికి ఆ పదవి ఉపయోగిస్తానని వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉంది,’ అని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

Weather Report: ఇక కాస్కోండి.. ఒక్క‌సారిగా మారుతోన్న వాతావ‌ర‌ణం.
YS Jagan Comments: అలా చేయడం బాబుకే సాధ్యం జగన్ కీలక కామెన్స్ కామెంట్స్| Asianet News Telugu