ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు.. వివరాలు ఇవే..

Published : Jul 18, 2023, 12:12 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు.. వివరాలు ఇవే..

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు బెయిల్ లభించింది. అనారోగ్య కారణాలపై ఆయనకు ఢిల్లీ హైకోర్టు 4 వారాల బెయిల్ మంజూరు చేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాలపై ఆయనకు ఢిల్లీ హైకోర్టు 4 వారాల బెయిల్ మంజూరు చేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హైకోర్టు ఈ బెయిల్ ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్.. ఈడీ ఎప్పుడూ విచారణకు పిలిచిన చెన్నై లేదా ఢిల్లీలోని వారి కార్యాలయాల్లో హాజరుకావాలని మాగుంట రాఘవను ఆదేశించింది. 

ట్రయల్ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు పేర్కొంది. పాస్‌పోర్టును ట్రయల్ కోర్టు ఎదుట సమర్పించాలని ఆదేశించింది. అలాగే.. మాగుంట రాఘవ చెన్నైకే పరిమితం కావాలని.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు ఈడీ అధికారులకు రిపోర్టు చేయాలని హైకోర్టు పేర్కొంది.

అయితే మాగుంట రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యతిరేకించలేదు. గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవకు బెయిల్ ఇవ్వగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 10న మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవ కీలకంగా వ్యవహరించినట్టుగా దర్యాప్తు సంస్థలు ఆరోపించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!