మంత్రితో వైరం: జగన్ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పిలుపు

By narsimha lode  |  First Published Jul 18, 2023, 9:53 AM IST

వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు  సీఎం జగన్ ను ఫోన్ వచ్చింది.దీంతో  పిల్లి సుభాష్ చంద్రబోస్  తాడేపల్లికి బయలుదేరారు.


అమరావతి:వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు  ఏపీ సీఎం వైఎస్ జగన్ నుండి పిలుపు వచ్చింది.  దీంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారంనాడు ఉదయం తాడేపల్లికి బయలుదేరారు. తాడేపల్లిలో  వైఎస్ఆర్‌సీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ నేడు జగన్ తో భేటీ కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది.సోమవారం రాత్రి  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో  పిల్లి సుభాష్ చంద్రబోస్  భేటీ అయ్యారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పై  పిల్లి సుభాష్ చంద్రబోస్  ఫిర్యాదు  చేశారు. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు  చేసుకున్న పరిణామాలను కూడ ఆయన వివరించారు.

వచ్చే ఎన్నికల్లో  రామచంద్రాపురం అసెంబ్లీ స్థానంనుండి  తన కొడుకు సూర్య ప్రకాష్ ను  బరిలోకి దింపాలని   పిల్లి సుభాష్ చంద్రబోస్ భావిస్తున్నారు.  అయితే ఈ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ బరిలోకి దిగుతారని  ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్  మిథున్ రెడ్డి చేసిన ప్రకటన  పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తికి కారణమైంది. దీంతో  పార్టీ నిర్వహించిన  కార్యక్రమాలకు కూడ ఆయన దూరంగా ఉన్నారు.

Latest Videos

undefined

గత కొంత కాలంగా  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ , ఎంపీ  పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇటీవల కాలంలో  ఈ పోరు మరింత తీవ్రమైంది.   పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు  రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించి  పిల్లి సూర్యప్రకాష్ ను  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని  తీర్మాణం కూడ  చేశారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గానికి చెందిన  రామచంద్రాపురం మున్సిపల్ వైఎస్ చైర్మెన్ శివాజీపై మంత్రి వేణు వర్గీయులు దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. దీంతో  శివాజీ  ఆత్మహత్యాయత్నం  చేశారు.  ఈ ఆరోపణలను మంత్రి చెల్లుబోయిన వేణు  ఖండించారు.

also read:తాడేపల్లికి చేరిన రామచంద్రాపురం పంచాయితీ: సజ్జలతో పిల్లి భేటీ, ఫోన్ లో వేణుతో చర్చలు

గత కొంత కాలంగా  రామచంద్రాపురంలో  పిల్లి సుభాష్ చంద్రబోస్  వర్గీయులు  ఏ రకంగా వ్యవహరిస్తున్నారనే విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నారు చెల్లుబోయిన వేణు.  నిన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  ఫోన్  చేసిన  సమయంలో  మంత్రి వేణు కూడ  పిల్లి సుభాష్ వర్గం ఏ రకంగా వ్యవహరిస్తుందో వివరించారు.రామచంద్రాపురంలో చోటు  చేసుకున్న పరిణామాలను వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం  సీరియస్ గా తీసుకుంది.దీంతో   పిల్లి సుభాష్ చంద్రబోస్ కు  సీఎం జగన్ నుండి పిలుపు వచ్చింది.  ఇవాళ  11 గంటల తర్వాత  సీఎం జగన్  తో పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ కానున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్ వెంటే నడిచారు.  పార్టీ కూడ సుభాష్ చంద్రబోస్ అదే రకమైన ప్రాధాన్యత ఇచ్చిందని  వేణుగోపాల్  వర్గీయులు గుర్తు చేస్తున్నారు.


 


 


 

click me!