రాష్ట్రానికి ఐఏఎస్ లు కావలెను....

First Published Oct 3, 2017, 8:34 AM IST
Highlights
  • రాష్ట్రంలో పని చేయటానికి ఐఏఎస్ లు కావాలంటూ కేంద్రాన్నిఅడుక్కునే పరిస్ధితి తెలెత్తింది.
  • సీనియర్లెవరూ ఏపిలో పనిచేయటానికి ఇష్టపడటం లేదు.
  • దానికితోడు పని ఒత్తడిని తట్టుకోలేక, పరిపాలనలో అడ్డదిడ్డమైన ఆదేశాలను అమలు చేయలేక పలువురు ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతున్నారు.

రాష్ట్రంలో పని చేయటానికి ఐఏఎస్ లు కావాలంటూ కేంద్రాన్నిఅడుక్కునే పరిస్ధితి తెలెత్తింది. సీనియర్లెవరూ ఏపిలో పనిచేయటానికి ఇష్టపడటం లేదు. దానికితోడు పని ఒత్తడిని తట్టుకోలేక, పరిపాలనలో అడ్డదిడ్డమైన ఆదేశాలను అమలు చేయలేక పలువురు ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతున్నారు. గడచిన మూడున్నరేళ్ళలో 22 మంది సీనియర్ ఐఏఎస్ లు రాష్ట్రంలో పని చేయలేక ఢిల్లీకి వెళ్ళిపోయారంటేనే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. ఇంకా చాలామంది వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

విభజన జరిగినపుడు ఏపిలో 211 మంది ఐఏఎస్ అధికారులుండాలి. అయితే, కేటాయించింది కేవలం 165 మందిని మాత్రమే. దాంతో పలు శాఖలను కుదించటం, రెండు మూడు శాఖలకు ఒకే అధికారిని నియమించటం లాంటి చర్యలతో ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఇటువంటి నేపధ్యంలోనే ‘‘ఓటుకునోటు’’ కేసు తెరపైకి వచ్చింది. దాంతో అర్ధాంతరంగా ప్రభుత్వం హైదరాబాద్ నుండి విజయవాడకు మారింది. దాంతో అందరు ఉద్యోగులకు సమస్యలు మొదలైనట్లే  ఐఏఎస్ అధికారులకు కూడా సమస్యలు మొదలయ్యాయి.

ఉద్యోగులేమో విజయవాడలో, వారి కుటుంబాలేమో హైదరాబాద్ లో. ఈ డెవలప్మెంట్ అన్నీ విధాలుగా అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. దానికితోడు పెరిగిపోయిన పనిభారం. చంద్రబాబునాయుడు అడ్డదిడ్డమైన పాలనతో ఐఏఎస్ లపై బాగా ఒత్తిడి పెరిగిపోయింది.

ప్రతీ రోజూ గంటలు, గంటలు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్పులు, టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఒకే అంశంపై ఒకేరోజు రెండు మూడు సార్లు సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పనిచేసుకోనీకుండా ప్రతీ రోజూ ఏదో ఒక కాన్ఫరెన్సు. పరిపాలనా పరమైన విషయాల్లో కూడా తమ్ముళ్ళ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో తాము చెప్పిన మాట వినని వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి. రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యం పై విజయవాడ ఎంపి, విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్దా వెంకన్నల దాడే అందుకు ఉదాహరణ.

అన్నీ వైపుల నుండి చుట్టుముడుతున్న సమస్యలను తట్టుకోలేక చాలా మంది ఐఏఎస్ అధికారులు ఏపిలో లాభం లేదని ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. దాంతో ఇపుడు రాష్ట్రంలో 140 మంది ఐఏఎస్ లు మాత్రమే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇక్కడ ఉండలేమనుకుని ఢిల్లీ వైపు చూస్తున్న వారి సంఖ్య మరింత పెరిగిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.

 

click me!