మంత్రి గారూ, మీ వూరెలా ఉందో చూశారా? (వీడియో)

First Published Sep 8, 2017, 1:57 PM IST
Highlights

రాయదర్గం ఎమ్మెల్యే, ఆంధ్రలోమంత్రి కాలువ శ్రీనివాసులకు వూరెలా ఉందో చూపిస్తున్నారు రాయదర్గం అభివృద్ధి వేదిక వారు

 

 

రాయదుర్గం పట్టణం లోని బాలికల ఉన్నత పాఠశాల కాంపౌండ్ గోడ ను రోడ్డు విస్తరణ పనులు కారణంగా రెండేళ్ల క్రితం తొలగించారు. తిరిగి పునర్నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షం పడినపుడు డ్రైనేజీ లోని మరుగునీరు పాఠశాల ఆవరణలోకి చేరడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బాలికల జూనియర్ కళాశాల కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. మెతం 1500 మందిపైగా బాలికలు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఇంతమంది బాలికలుండే ఈ విద్యా సంస్థలో బాత్రూమ్ ల సమస్య, త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఏ అధికారి, ప్రజాప్రతినిధులూ అటువైపుకూడా చూసే తీరికలేదు. ఆ పాఠశాల పరిస్థితులు, సమస్యల గురించి మీడియా కథనాలు, రాయదుర్గం అభివృద్ది వేదిక వినతిపత్రాలూ ఎవరూ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధుల మీటింగులకు ఇక్కడి విద్యార్థులు కావాలి కానీ వారిసాధకభాధలు గురించి వీరికి పట్టదు. ఆడబిడ్డల గురించి ఎందుకంత వివక్ష? , వీరికి ఓట్లు లేవనే ధీమానా? అధికారులు, పాలకులు, రాజకీయ నేతలూ కనీస మానవత్వమైనా ఈ పాఠశాల పై చూపండని రాయదుర్గం అభివృద్ధి వేదిక కోరుతున్నది.

 

 

 

 

 

click me!