రాజధాని నిర్మాణంపై సిబిఐ విచారణ జరిపించాలి

Published : Sep 08, 2017, 01:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
రాజధాని నిర్మాణంపై సిబిఐ విచారణ జరిపించాలి

సారాంశం

రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియపై సిబిఐతో కానీ లేక న్యాయవిచారణ కానీ జరపించాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. శుక్రవారం వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు అందరినీ మోసం చేస్తున్నట్లు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం ముసుగులో ఇంతకాలం తాము చేస్తున్న ఆరోపణలనే తాజాగా ఐవైఆర్ కృష్ణారావు సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టాన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియపై సిబిఐతో కానీ లేక న్యాయవిచారణ కానీ జరపించాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. శుక్రవారం వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు అందరినీ మోసం చేస్తున్నట్లు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం ముసుగులో ఇంతకాలం తాము చేస్తున్న ఆరోపణలనే తాజాగా ఐవైఆర్ కృష్ణారావు సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టాన్నారు. మాజీ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ బయటపెట్టిన ఆధారాల ప్రకారం, చేసిన ఆరోపణల ప్రకారం తాము చెప్పినదంతా నిజమేనని ప్రజలు గమనించాలన్నారు.

రాజధానికి శంకుస్ధాపనల పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు 7 సార్లు శంకుస్ధాపనలు చేసారని ఎద్దేవా చేసారు. చంద్రబాబు అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానం తప్పని న్యాయస్ధానం చెప్పినా ఖాతరు చేయకుండా అదే పద్దతిలో వెళుతున్నట్లు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబుకు భూములు ఇచ్చిన రైతులు మోసపోయామంటూ నెత్తినోరు మొత్తుకుంటున్నారని ఆళ్ళ చెప్పారు. తక్షణమే రాజధాని నిర్మాణంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేసారుప.

ఆంధ్రులకు రాజధాని కావాలంటే చంద్రబాబు వల్ల సాధ్యం కాదన్నారు. రాజధాని నిర్మాణం ముసుగులో చంద్రబాబు అన్నీ వర్గాలను మోసం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుసరిస్తున్న పద్దతిలో అయితే రాజధాని నిర్మాణం సాధ్యం కాదన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రాజధాని నిర్మాణం పేరుతో వసూళ్ళు చేసిన డబ్బునంతా సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు మండిపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu