టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి: పురందేశ్వరి

Published : Aug 08, 2023, 03:12 PM IST
టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి: పురందేశ్వరి

సారాంశం

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి అనేది రాజకీయ పునరావాస పదవి కారాదు అని అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి న్యాయం చేయగలరని అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి అనేది రాజకీయ పునరావాస పదవి కారాదు అని అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి న్యాయం చేయగలరని అన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని, అనుసరించే వాళ్లని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పురందేశ్వరి ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. 

‘‘తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మంపై నమ్మకమున్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. ఈ విషయం పై గలం విప్పిన తరువాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్ధమవుతున్నది. కనుక టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని, హిందూ ధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలి’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు. 

అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు కొత్త చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో పురందేశ్వరి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?