నెలాఖరులోగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం : సీఎం వైఎస్ జగన్

Siva Kodati |  
Published : Aug 08, 2023, 02:46 PM IST
నెలాఖరులోగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం : సీఎం వైఎస్ జగన్

సారాంశం

ఈ నెలాఖరులోగా వరదల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. పంట నష్టం జరిగితే యుద్ధ ప్రాతిపదికన సమాచారం సేకరిస్తున్నామని జగన్ తెలిపారు. 

పంట నష్టం జరిగిన రైతుల వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామాయంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..  వరద బాధితులకు అధికారుల సాయంపై తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తామన్నారు. ఆర్బీకేల్లో పేర్లు లేకపోతే ఫిర్యాదు చేస్తే వెంటనే పంట నష్టం అందేందుకు సాయం చేస్తామని సీఎం తెలిపారు. 

గతంలో వరద బాధితులను ఎవరూ పట్టించుకోలేదని.. నాడు-నేడు పరిస్ధితులను ఒకసారి చూడాలన్నారు. మనం అధికారంలోకి వచ్చాక పరిస్ధితి మారిందన్నారు. గతంలో పేపర్‌లో ఫోటోలు వస్తే చాలు అనుకునేవారని సీఎం ఎద్దేవా చేశారు. పంట నష్టం జరిగితే యుద్ధ ప్రాతిపదికన సమాచారం సేకరిస్తున్నామని జగన్ తెలిపారు. వారం గడిచాక తానే మరోసారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని.. సాయం గురించి వివరాలు అడిగి తెలుసుకుంటానని సీఎం అన్నారు. వరదలు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునేందుకు ముందుగానే నిధులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వారంలోపే బాధితులకు సాయం అందాలని కలెక్టర్లను ఆదేశించామని జగన్ వెల్లడించారు. 

ఇల్లు పాక్షికంగా ధ్వంసమైనా, పూర్తిగా ధ్వంసమైనా పదివేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందినందుకు సంతోషంగా వుందని జగన్ చెప్పారు. గుడిసెలు డ్యామేజ్ అయినా పరిహారంలో కోత పెట్టొద్దని చెప్పానని ముఖ్యమంత్రి వెల్లడించారు. పంట నష్టం జరిగిన వెంటనే ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు రంగంలోకి దిగుతున్నాయని జగన్ పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా వరదల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఇకపోతే.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఓ పేద విద్యార్థి పెద్ద కలను సాకారం చేసేందుకు ఇప్పటికే భారీగా ఆర్థికసాయం చేసింది వైసిపి ప్రభుత్వం. అయితే తన లక్ష్యం నెలవేరాలంటే మరిన్ని డబ్బులు కావాలని... దయచేసి సాయం చేయాలని యువతి సీఎంను కోరింది. దీంతో మరింత సాయం అందిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.    

ALso Read: సీఎం జగన్ గొప్పమనసు... యువతి పైలట్ కలకు రెక్కలుతొడుగుతూ అద్భుత సాయం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రావణి చదవులో మంచి చురుకైన అమ్మాయి. పైలట్ కావాలన్న ఆమె కలను ఆర్థికకష్టాలు అడ్డుపడ్డాయి. కానీ ఎలాగయినా తన లక్ష్యాన్ని సాధించాలని పట్టుదలతో వున్న శ్రావణికి తల్లిదండ్రులు అండగా నిలిచారు. గతేడాది జూలైలో రాజమండ్రి పర్యటనకు వచ్చిన సీఎం జగన్ ను తల్లిదండ్రులతో పాటు కలిసింది శ్రావణి. తన ఉన్నత చదువుకు ఆర్థిక సాయం చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు జగన్.దీంతో శ్రావణి ఏవియేషన్ శిక్షణకు వైసిపి ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం చేసింది. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రోత్సాహంతో ఏవియేషన్ శిక్షణ ప్రారంభించిన జాహ్నవి అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన  ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. అయితే ఇలా ఎంత ప్రతిభ వున్నా పైలట్ శిక్షణ పొందేందుకు భారీగా ఖర్చుచేయాల్సి వుంటుంది. దీంతో ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని సీఎం జగన్ ను మరోసారి విజ్ఞప్తి చేసింది జాహ్నవి. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సాయంతో మరోసారి సీఎంను కలిసింది జాహ్నవి. ఆమె విజ్ఞప్తిని మన్నించిన సీఎం ఆర్థికసాయంపై సానుకూలంగా స్పందించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్