సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు: చిరంజీవి వ్యాఖ్యలకు కొడాలి కౌంటర్

By narsimha lode  |  First Published Aug 8, 2023, 2:01 PM IST

సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ విషయంలో  చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై  మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.


 

అమరావతి:సినీ ఇండస్ట్రీలో  చాలా మంది పకోడిగాళ్లున్నారని  మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. హీరోల రెమ్యూనరేషన్ గురించి  సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై  మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.  మంగళవారంనాడు ఆయన ఈ విషయమై  మీడియాతో మాట్లాడారు.ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహా ఇస్తున్నారన్నారు.ఆ పకోడిగాళ్లు తనవాళ్లకు సలహాలు ఇచ్చుకోవచ్చు కదా అని ఆయన సెటైర్లు వేశారు.రాజకీయాలు ఎందుకు  , డ్యాన్సులు, ఫైట్స్, యాక్షన్ గురించి మనం చూసుకుందామని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు.

Latest Videos

undefined

ఈ రాష్ట్రం లో ఎక్కువ కాలం  పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా  రాష్ట్రాన్ని  బాబు  ఏం అభివృద్ది చేశాడని  నాని ప్రశ్నించారు.  చంద్రబాబు సెల్ఫీల గురించి ఏం మాట్లాడనవసరం లేదన్నారు.పుంగనూరు లో ఆయా జిల్లాల నుండి అల్లరిమూకను వెంటేసుకొచ్చి అల్లర్లు చేశాడని  నాని  ఆరోపించారు. చంద్రబాబు ఉంటేనే అక్కడ నాయకులు పోతుగాళ్లా అని  ఆయన అడిగారు. మరి ఇపుడు అల్లర్లు చేయాలని  సవాల్  విసిరారు. 

జనసేన కాదది జనసున్న పార్టీ అంటూ నాని  సెటైర్లు  వేశారు.  పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల ఓడిపోయే సత్తా ఉన్న నాయకుడంటూ  ఎద్దేవా చేశారు.మోకాళ్ళు మీద కూర్చోబెడతా, గుండు కోటిస్తా, తాట తీస్తా అంటూ అంటాడు కానీ ఆయన కోటించుకున్నట్లు ఎవరికైనా గుండు కొట్టించాడా...ఎవరినైనా కొట్టాడా.. ప్రజలే నిన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాడని చురకలంటించారు.

వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో  సినీ నటుల రెమ్యూనరేషన్ గురించి వ్యాఖ్యలు  చేశారు.  డిమాండ్, ఆదరణ  ఉన్నప్పుడు  నటీనటుల రెమ్యూనరేషన్లు ఎక్కువగా ఉంటాయని  చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు ఆ ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటారని చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. 

also read:తమ్ముడికి అండగా అన్న.. జగన్‌ సర్కార్‌కు చిరంజీవి కౌంటర్!.. రూట్ మారుస్తున్నారా?

పవన్ కళ్యాణ్  నటించిన  బ్రో  సినిమా  ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.  ఈ సినిమాలో  ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలిన పాత్ర ఉందనే ప్రచారం సాగుతుంది.అయితే  ఈ ప్రచారాన్ని  బ్రో సినిమా  నిర్మాత  ప్రసాద్  కొట్టిపారేశారు. 

click me!