నోట్ల మార్పిడి కేసు : ఆర్ఐ స్వర్ణలత హీరోయిన్ కాదు.. దర్శకుడు ఏమంటున్నారంటే...

By SumaBala Bukka  |  First Published Jul 11, 2023, 11:53 AM IST

నోట్ల మార్పిడి దందా కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న ఆర్ఐ స్వర్ణలతమీద సస్పెన్షన్ వేటు పడింది. అంతేకాదు ఆమె ‘ఏపీ 3’లో హీరోయిన్ కాదని డైరెక్టర్ తేల్చేశాడు. 
 


విశాఖపట్నం : ఏఆర్ సిఐ స్వర్ణలత..  ఈ పేరు వినగానే.. లేడీ పోలీస్ తో పాటు.. ఆమె చేసిన డాన్స్ వీడియోలు.. సినిమా పోస్టర్లు  గుర్తుకు వస్తున్నాయా?.. నోట్ల మార్పిడి దందాలో అరెస్ట్ అయిన తర్వాత.. సినిమా పోస్టర్లు, డాన్స్ రీల్స్, వీడియోలతో  రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది స్వర్ణలత. సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ కేసులో స్వర్ణలత రిమాండ్ లో ఉంది.  

అయితే ఇప్పుడు ఆమెకు అనుకోని షాక్ తగిలింది. పెట్టుకున్న ఆశలు కుప్పకూలిపోయాయి. హీరోయిన్ అవుదామని చేసిన కష్టమంతా.. పడ్డ పాట్లన్నీ వృధా అయ్యాయి. ‘ఏపీ 3’ అనే సినిమాలో  స్వర్ణలత హీరోయిన్ అని పోస్టర్లు కూడా కనిపించాయి.. అయితే ఈ సినిమా దర్శకుడు కేవీఆర్ మాట్లాడుతూ.. తమ సినిమాలో హీరోయిన్ స్వర్ణలత కాదు అని తేల్చేశాడు. కేవలం స్వర్ణలతది అతిథి పాత్ర మాత్రమే అని స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

వలంటీర్ వ్యవస్థ చాలా ప్రమాదకరం.. రూ.5 వేలు ఇచ్చి, ఇంట్లోకి దూరే అవకాశమిచ్చారు - పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అంతేకాదు తమ సినిమాలో ఆమె పెట్టుబడి పెట్టలేదని చెప్పారు.  తమ సినిమా హీరోయిన్ బిగ్ బాస్ ఫేమ్ లహరి అని వివరించారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అయిన వీడియోలు ఫోటోలు తమ సినిమాలోవి కాదని తెలిపారు. మరోవైపు నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్టు అయిన ఏఆర్ఆర్ఐ హోంగార్డ్స్ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటుపడింది.  

ఆమెతోపాటు కేసులో ఏ2గా ఉన్న ఏం హేమ సుందర్ ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సీఎం త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 90 లక్షల విలువ గల 500 నోట్లు ఇస్తే రెండు కోట్ల విలువైన 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే.

అయితే, స్వర్ణలత జీవితంలో ఇవే కాకుండా మరో కోణం కూడా ఉంది. ఆమె తన సొంత జిల్లా అయిన విజయనగరంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. దీనికోసం తన పేరుతోనే స్వర్ణఫౌండేషన్ గ్రూప్ ను ప్రారంభించారు. దీనికింద విద్యార్థులకు, మహిళలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. 

 

click me!