రెండు విజ‌యాల‌తో విమ‌ర్శ‌కుల నోర్లు మూయించాం

Published : Sep 04, 2017, 06:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
రెండు విజ‌యాల‌తో విమ‌ర్శ‌కుల నోర్లు మూయించాం

సారాంశం

అభినందన సభలో నారా లోకేష్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌. కాకినాడ, నంద్యాల ఎన్నికల సరళిపైన వివరణ. రెండు ఎన్నికల గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందన్నారు. 2019 ఎన్నికల విజయమే లక్ష్యంగా కార్యాచరణ.

 నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచి ప్ర‌తిప‌క్షాల‌, విమ‌ర్శ‌కుల‌ నోర్లు మూయించామ‌ని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ విజ‌యాల‌తో పార్టీ శ్రేణుల్లో ఉత్స‌హాం మ‌రింత పెరిగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సోమ‌వారం మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో టీడీపీ అభినందన సభ జరిగింది. ఈ సభలో మంత్రి నారా లోకేష్ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.


 నంద్యాల‌, కాకినాడ లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌ర‌ళిపై అందులో టీడీపి విజ‌యానికి దోహదం చేసిన ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ లోకేష్ త‌న ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. గెలుపుతో ప్రతిపక్షానికి దీటైన సమాధానం చెప్పామని లోకేష్ తెలిపారు.
 పార్టీలో ఇదే ఒరవడిని భవిష్యత్‌లోనూ కొనసాగిద్దామని టీడీపీ నేతలకు, పార్టీ శ్రేణులకు లోకేష్‌ పిలుపునిచ్చారు. ప్రతి 15 రోజులకోమారు శిక్షణా తరగతులను నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించనున్నట్లు లోకేష్ తెలిపారు. అందులో 2019 సాధార‌ణ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌పై మంద‌స్తు క‌స‌ర‌త్తు జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.
 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి  

జయప్రకాశ్ నారాయణ్ మాటెవరయినా వింటారా...!

 

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu