
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా హిందూపురంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొంటున్నారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆటోనగర్ సమీపంలో కోటి 50లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్‌టీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.20కోట్లతో నిర్మించే మార్కెట్‌యార్డ్ కు భూమిపూజ చేశారు. బాలకృష్ణ వెంట స్థానిక నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మీనాగరాజుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.