ఐటి రంగంలో మళ్ళీ సంక్షోభమా?

Published : May 11, 2017, 07:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఐటి రంగంలో మళ్ళీ సంక్షోభమా?

సారాంశం

సమైక్య రాష్ట్రం విడిపోయి మూడేళ్ళవుతున్నా ఇప్పటికీ ఐటి రంగమంటే రెండు రాష్ట్రాల్లోనూ హైదరాబాదే కేరాఫ్ అడ్రస్.  విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో సాఫ్ట్ వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబునాయుడు ఎన్ని చెప్పినా అవన్నీ మాటలకే పరిమితమైపోయింది.

రానున్న ఏడాదిలో ఐటి రంగంలో లక్ష ఉద్యోగాలు సాధ్యమేనా? దాదాపు పదేళ్ళ నాటి ఐటి సంక్షోభం మళ్ళీ మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. అప్పట్లో ఐటి రంగంలో ఏర్పడిన కుదుపుకు వేలమంది ఐటి నిపుణులు రోడ్డునపడ్డారు. అప్పటి నుండి ఐటి రంగం పెద్దగా కోలుకోలేదు. కంపెనీలు కూడా అంతకుముందులాగ కాకుండా ఆచితూచి ఉద్యోగాలిస్తున్నాయి.

కొత్తగా ఐటి శాఖమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ వచ్చే ఏడాదిలో ఐటి రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇటీవలే ప్రకటించారు. లోకేష్ అలా ప్రకటించి వారం రోజులైందో లేదో  ఒక్క హైదరాబాద్ లోనే సుమారు 10 వేలమంది ఉద్యోగాలు కోల్పోయారు. దాంతో అర్ధాంతరంగా ఉద్యోగాలు కోల్పోయిన వారంతా ఎన్నడూ లేనివిధంగా కార్మికశాఖకు ఫిర్యాదులు చేసారు.

సమైక్య రాష్ట్రం విడిపోయి మూడేళ్ళవుతున్నా ఇప్పటికీ ఐటి రంగమంటే రెండు రాష్ట్రాల్లోనూ హైదరాబాదే కేరాఫ్ అడ్రస్.  విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో సాఫ్ట్ వేర్ రంగాన్ని అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబునాయుడు ఎన్ని చెప్పినా అవన్నీ మాటలకే పరిమితమైపోయింది. దాంతో ఏపిలో ఐటి రంగంలో పెద్దగా పురోగతి కనిపించలేదు. అయితే, కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న లోకేష్ ఒకపుడు చంద్రబాబు చెప్పిన మాటలనే తాజాగా చెబుతున్నారు.

అయితే, హటాత్తుగా ఐటి రంగంలో సంక్షోభం నెలకొన్నట్లు ప్రచారం మొదలైంది. గడచిన వారం రోజులుగా హైదరాబాద్ లోని కంపెనీలు వేలాదిమందికి ఉధ్వాసన పలుకుతున్నాయి. ఇటువంటి పరిస్ధితుల్లో ఏపిలో లక్షమందికి ఐటి రంగంలోనే ఉద్యోగాలు కల్పించటం సాధ్యమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. లక్ష ఉద్యోగాల కల్పనకు లోకేష్ ఏం మాయ చేస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu