వ్యాక్సిన్ రియాక్షన్, ఆశావర్కర్ మృతి: జీజీహెచ్‌కు బాధితుల పరుగులు

By Siva KodatiFirst Published Jan 24, 2021, 8:55 PM IST
Highlights

కోవిడ్ నియంత్రణ కోసం భారతదేశంలో కొవాగ్జిన్, కోవిషీల్డ్‌లను అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయితే కొన్ని చోట్ల ఈ వ్యాక్సిన్‌లు రియాక్షన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు మృతి చెందారు కూడా. ఈ నేపథ్యంలో కరోనా వాక్సిన్ రియాక్షన్ బాధితులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు

కోవిడ్ నియంత్రణ కోసం భారతదేశంలో కొవాగ్జిన్, కోవిషీల్డ్‌లను అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయితే కొన్ని చోట్ల ఈ వ్యాక్సిన్‌లు రియాక్షన్ వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలువురు మృతి చెందారు కూడా. ఈ నేపథ్యంలో  కరోనా వాక్సిన్ రియాక్షన్ బాధితులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ రియాక్షన్‌తో 17 మంది ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

10 మందికి వైద్యం చేసి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది. అయితే బాధితుల వివరాలను వైద్యశాఖ గోప్యంగా ఉంచుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించడంతో మిగతా బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

Also Read:ఆశా వర్కర్ విజయలక్ష్మి మృతి: జీజీహెచ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న విజయలక్ష్మి మరణించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ వేయించుకుని అనారోగ్యానికి గురైన ఆమె జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నెల 19న విజయలక్ష్మి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది.

21వ తేదీన అస్వస్థతకు గురై జీజీహెచ్‌లో చేరింది. అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతున్న విజయలక్ష్మీ.. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయినట్లు ఆదివారం డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనతో ప్రభుత్వ వర్గాలు, మిగిలిన ఫ్రంట్ లైన్ కార్యకర్తలు ఉలిక్కిపడ్డాయి. 

click me!