కోర్టులో జెసికి దిమ్మతిరిగింది

First Published Jul 17, 2017, 6:40 PM IST
Highlights
  • ‘విమాన సిబ్బందితో మీరు ప్రవర్తించినట్లే..మీ ట్రావెల్స్  సిబ్బందితో ఎవరైనా ప్రవర్తిస్తే మీరేం చేస్తారు’ అని నిలదీసింది.
  • ‘విమాన సంస్ధ సిబ్బంది వాదన వినకుండా కేవలం మీ వాదనలు విని ఎలా ఆదేశాలు జారీ చేస్తామం’టూ లాయర్ ని నిలదీసింది.
  • ఈరోజు కోర్టు అడిగిన ప్రశ్నలతో జెసికి దిమ్మతిరిగింది.

అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డికి కోర్టులో దిమ్మతిరిగింది. ట్రావెల్ బ్యాన్ ఎత్తేయాలని విమానసంస్ధలను ఆదేశించాలంటూ జెసి దివాకర్ రెడ్డి కోర్టులో పిటీషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే కేసులో ఈరోజు కోర్టు అడిగిన ప్రశ్నలతో జెసికి దిమ్మతిరిగింది. విశాఖపట్నం విమానశ్రయంలో ఇండిగో విమానసిబ్బందిపై వీరంగం చేసి కూడా తన తప్పేమీ లేదని చెబుతున్న జెసికి కోర్టు ప్రశ్నలతో మతిపోయినంతపనైంది.

‘విమాన సిబ్బందితో మీరు ప్రవర్తించినట్లే..మీ ట్రావెల్స్  సిబ్బందితో ఎవరైనా ప్రవర్తిస్తే మీరేం చేస్తారు’ అని నిలదీసింది. దానికి ఏమి సమాధానం చెప్పాలో జెసి తరపు న్యాయవాదికి అర్ధం కాలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కనీసం సమావేశాలప్పుడన్నా విమానాల్లో ప్రయాణించేదుకు అనుమతించాలని ఆదేశించాలంటూ లాయర్ కోరారు. దాన్ని కూడా న్యాయమూర్తి తోసిపుచ్చింది. ‘విమాన సంస్ధ సిబ్బంది వాదన వినకుండా కేవలం మీ వాదనలు విని ఎలా ఆదేశాలు జారీ చేస్తామం’టూ లాయర్ ని నిలదీసింది. దాంతో న్యాయవాది ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. కోర్టు స్పందిచిన తీరును గమనిస్తే జెసి ట్రావెల్ బ్యాన్ ఇప్పట్లో తొలిగేలా లేదు.

click me!