జెసి నుండి ప్రాణహాని

Published : Jun 12, 2017, 04:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
జెసి నుండి ప్రాణహాని

సారాంశం

తనను చంపుతానంటూ ఎంఎల్ఏ నుండి బెదిరింపులు వస్తున్నట్లు కౌన్సిలర్ ఏకంగా జాయింట్ కలెక్టర్ కే ఫిర్యాదు చేసారు. అదే ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది.

తాడిపత్రి ఎంఎల్ఏ జెసి దివాకర్ రెడ్డి నుండి ప్రాణహాని ఉందంటూ కౌన్సిలర్ జయచంద్రారెడ్డి చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది. జెసి సోదరులంటే రాజకీయాల్లో తెలీని వారుండరు. ఆ సోదరుల్లో జెసి దివాకర్ రెడ్డే అనంతపురం జిల్లాలోని తాడిప్రతి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డి. తనను చంపుతానంటూ ఎంఎల్ఏ నుండి బెదిరింపులు వస్తున్నట్లు కౌన్సిలర్ ఏకంగా జాయింట్ కలెక్టర్ కే ఫిర్యాదు చేసారు. అదే ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది.

ఎంఎల్ఏపై  కౌన్సిలర్ గతంలో  పోలీసులకు ఫిర్యాదు చేసారట. అయితే వారెవరూ ఫిర్యాదును పట్టించుకోలేదు. కౌన్సిలర్ గతంలో పోలీసు స్టేషన్లో ఉన్నపుడే కొందరు దాడి చేసారు లేండి. అప్పటి నుండి ఎంఎల్ఏ-కౌన్సిలర్ కు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. ఆ నేపధ్యంలోనే కౌన్సిలర్ ఈ రోజు ఎంఎల్ఏపై ఫిర్యాదు చేసారు. జెసి సోదరులు తాడిపత్రిని దోచుకు తింటున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రూ. 250 కోట్లు సంపాదించారట సోదరులు. ఫిర్యాదు చేసాడు సరే.  మరి చర్యలు తీసుకునే వారెేరి?   జాయింట్ కలెక్టర్ ఏం చేస్తారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే