ఏపీలో ఆగని కరోనా విజృంభణ: 2841కి చేరుకున్న పాజిటివ్ కేసులు, 59 మరణాలు

By telugu teamFirst Published May 28, 2020, 11:40 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 54 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరొకరు మరణించారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో 54 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 2841కు చేరుకుంది. తాజాగా మరో మరణం సంభవించింది. దీంతో మరణాల సంఖ్య 59కు చేరుకుంది 

గత 24 గంటల్లో 9,858 శాంపిల్స్ ను పరిశీలించగా 54 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 45 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 2841 పాజిటివ్ కేసులకు గాను 1958 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 824 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారిలో గత 24 గంటల్లో కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ కేసుల్లో రెండు నెల్లూరు జిల్లాలో, ఒక్కటేసి చొప్పున చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది.

విదేశాల నుంచి వచ్చినవారిలో 111 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ 111 కేసులు కూడా యాక్టివ్ గానే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 293 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరిలో 23 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. 126 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

 

as 0n 28/05/2020:
*Total positive cases: 2841
*Discharged: 1958
*Deceased: 59
*Active cases: 824 pic.twitter.com/78xnPSZsyT

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!