చాప కింద నీరులా కరోనా.. దేశానికి కాలసర్ప దోషం: విశాఖ శారద పీఠాధిపతి

By Siva KodatiFirst Published Mar 18, 2020, 10:11 PM IST
Highlights

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తున్న నేపథ్యంలో పీఠాధిపతులు, వివిధ ఆధ్యాత్మిక సంస్థలు శాంతి హోమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రత్యేక హోమాలు ప్రారంభమయ్యాయి

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తున్న నేపథ్యంలో పీఠాధిపతులు, వివిధ ఆధ్యాత్మిక సంస్థలు శాంతి హోమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రత్యేక హోమాలు ప్రారంభమయ్యాయి.

ఈ యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. బుధవారం నుంచి 11 రోజుల పాటు ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు కొనసాగుతాయని శారద పీఠం తెలిపింది. మరోవైపు శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం నుంచి ధన్వంతరి హోమం ప్రారంభమైంది. ముందుజాగ్రత్త చర్యగా 12 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు ఆలయ దర్శనానికి దూరంగా ఉండాలని దేవస్థానం సూచించింది.

Also Read:వారికి కరోనా లక్షణాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్

హోమంపై శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు గాను అమృత పాశుపత సహిత, విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. వేద మంత్రాలు, బీజాక్షరాల సంపుటి చేసి సామాజిక స్పృహతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు స్వాత్మానందేంద్ర తెలిపారు.

భారతదేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక.. గురుడి శక్తిని క్షీణింపజేసేలా పాప గ్రహాల శక్తి పుంజుకుందని ఆయన చెప్పారు. రాహు దృష్టి కారణంగా ఈ నెల 23 వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందని స్వాత్మానందేంద్ర వెల్లడించారు.

Also Read:సెలవులు రద్దు, ఆరు కరోనా పాజిటివ్ కేసులు: ఈటల రాజేందర్

శని, కుజ కలయిక వల్ల దేశ, విదేశాల మీద ప్రభావం ఉంటుందన్నారు. ఏప్రిల్ 2 నుంచి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉందని, వీటన్నింటి వల్ల ఈ అమృత పాశుపత సహిత విషజ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నామని స్వాత్మానందేంద్ర పేర్కోన్నారు.

ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది పాల్గొంటున్నారని స్వామిజీ తెలిపారు. ఈ యాగంలో సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు, గోమయంతో తయారైన పిడకలు వంటి వాటిని ఉపయోగిస్తున్నామని.. ఈ యాగ ధూళి ప్రపంచానికి మంచి చేస్తుందని స్వామి స్వాత్మానందేంద్ర వెల్లడించారు. 

click me!