వైసిపిలో చేరనున్నట్లు ప్రచారం... క్లారిటీ ఇచ్చిన టిడిపి మాజీ ఎమ్మెల్యే బిసి

By Arun Kumar PFirst Published Mar 18, 2020, 8:45 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నుండి అధికార వైసిపిలోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి కూడా జంప్ అవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ  ప్రచారంపై తాజాగా మాజీ ఎమ్మెల్యే స్పందించారు. 

కర్నూల్: స్ధానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో టిడిపి నుండి అధికార వైసిపిలోకి మొదలైన వలసలు ఎన్నికలు వాయిదాపడ్డా ఆగడం లేదు. ఇప్పటికే టిడిపి సీనియర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇలా చాలామంది వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా చాలామంది టిడిపిని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా కర్నూల్ జిల్లా బనగానపల్లె టిడిపి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి పేరు  కూడా ఈ జంపింగ్ లిస్ట్ లో వున్నట్లు ప్రచారంలో జరుగుతోంది. 

అయితే తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లుగా జరుగుతున్న ఈ ప్రచారంపై జనార్ధన్ స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారమంతా అవాస్తమంటూ ఖండిచారు. తాను ఇప్పటికయితే టిడిపి వీడాలన్న ఆలోచనలో లేనని స్ఫష్టం చేశారు. 

హైదరాబాదులో వైసిపి ముఖ్య నాయకులను కలిసినట్లు వచ్చిన వార్తలన్నీ అవాస్తమేనని... తాను ఆ పార్టీ నాయకులెవ్వరితో సంప్రదింపులు జరపలేదన్నారు. అయినా వైసిపి నాయకులు కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. కేవలం వ్యక్తిగత పనులపైనే ఇటీవల హైదరాబాదుకు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. 

read more  ఏ1,ఏ2లు నోటికొచ్చినట్లు...సుప్రీంకు కులాలు అంటగడతారా..?: దేవినేని ఉమ ఆగ్రహం

ఇంతకాలం తనవెంటే వున్న కార్యకర్తలకు అండగా ఉంటానని... ఎవ్వరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారబోనని అన్నారు. కష్టకాలంలో వున్న పార్టీకి అండగా వుండి మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తానని బిసి జనార్ధన్ తెలిపారు. 

వైసీపీ ముఖ్యనేత, ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం అయ్యారని కర్నూల్ జిల్లాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సోమవారం హైదరాబాదులో ఇరువురు నేతల సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ చర్చలు సఫలం కావడంతో బిసి వైసిపిలో చేరడం లాంఛనప్రాయమే అన్న ప్రచారం సాగుతోంది. 

 కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా బిసి జనాార్ధన్ కి పేరుంది. దీంతో ఆయనకు వలవేసి తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలన్నది వైసిపి వ్యూహంగా  కనిపిస్తోంది. అందుకోసం సజ్జలను రంగంలోకి దింపినట్లు... ఇప్పటికే ఆయన తన పనిని కూడాపూర్తిచేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

read more  ఓవైపు కరోనా... మరోవైపు ప్రకృతి విపత్తు: ఉత్తరాంధ్రకు పొంచివున్న ప్రమాదం

2014లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం నుండి  టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాటసాని రామిరెడ్డి పై 17,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా వారిలో  బీసీ జనార్దన్ రెడ్డి ఒకరు..

2019 ఎన్నికల్లో వైసీపీకి  బీసీ జనార్దన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో అత్యల్ప ఓట్లు మెజార్టీతో ఓటమి పాలయ్యారు  సుమారు 13 వేల ఓట్ల మెజార్టీతో ఓటమి పాలు కావడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డిఓటమిపాలైన ప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.

 
  

click me!