మహిళకు కరోనా పాజిటివ్: ఏపీలో 6కు చేరిన కరోనా కేసులు

Published : Mar 23, 2020, 08:43 AM ISTUpdated : Mar 23, 2020, 02:40 PM IST
మహిళకు కరోనా పాజిటివ్: ఏపీలో 6కు చేరిన కరోనా కేసులు

సారాంశం

కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుకు చేరుకున్నాయి. విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో కరోనావైరస్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది.  49 సంవత్సరాల మహిళకు తాజాగా పాజిటివ్ వచ్చింది. ఈ మహిళ విశాఖపట్నంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కుటుంబసభ్యురాలు.

తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు పాజిటివ్ కేసు వ్యక్తికి తాజా పరీక్షలలో ఉపశమనం లభించింది.  రెండు సార్లు నిర్వహించిన పరీక్షలలో నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరులో ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తిని త్వరలో డిశ్చార్జ్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 

Also Read: క్వారంటైన్ పాటించకుండా బయటకు.. నలుగురిపై కేసు

విదేశాల నుంచి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి 13,301 మంది వచ్చారని ప్రభుత్వం తెలిపింది. 

11,206 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నరని చెప్పింది. 2,222 మందికి ఇళ్లలోనే 28 రోజుల ఐసోలేషన్ పూర్తయిందని, 53 మందిని ఆస్పత్రుల్లో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. మరో 16 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని చెప్పింది. 

Also Read: కరోనా ఎఫెక్ట్.. సమస్యల్లో కూరుకుపోయిన స్టార్ హీరో సినిమా

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu