కేసీఆర్ బాటలో జగన్: ఏపీలోనూ 31 వరకు లాక్‌డౌన్

By Siva KodatiFirst Published Mar 22, 2020, 7:51 PM IST
Highlights

కరోనాను అరికట్టేందుకు గాను సోషల్ డిస్టెన్సింగ్ ఆగిపోవాలని దీనిలో భాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మూసివేశాయని తెలిపారు. ఆదివారం నుంచి అంతరాష్ట్ర సర్వీసులతో పాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు జగన్ తెలిపారు. 

కరోనాను అరికట్టేందుకు గాను సోషల్ డిస్టెన్సింగ్ ఆగిపోవాలని దీనిలో భాగంగా దేశంలోని 12 రాష్ట్రాలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మూసివేశాయని తెలిపారు. ఆదివారం నుంచి అంతరాష్ట్ర సర్వీసులతో పాటు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు జగన్ తెలిపారు.

ఆటోలు, క్యాబ్‌లను అత్యవసర సర్వీసులకు మాత్రమే వినియోగించుకోవాలని పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. అత్యవసరం కానీ దుకాణాలను మార్చి 31 వరకు మూసివేయాలని జగన్ ఆదేశించారు.

Also Read:31 వరకు తెలంగాణ లాక్‌డౌన్: కేసీఆర్ అధికారిక ప్రకటన

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థితిలో ఉందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. జనతా కర్ఫ్యూ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రెండు లక్షల మంది వాలంటీర్లు కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వాన్ని అందజేస్తున్నారని తెలిపారు.

11,670 మంది విదేశీయులను ట్రాక్ చేయడంతో  పాటు నిఘా వుంచేందుకు వీలు కలిగిందని జగన్ తెలిపారు. వీరిలో 10,091 మంది హోమ్ ఐసోలేషన్‌లో, 24 మందిని ఆసుపత్రికి తరలించామని సీఎం చెప్పారు.

ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని జగన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో 200 పడకల వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరికైనా గొంతు నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే 104కు ఫోన్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

విద్యాసంస్థలన్నీ ఇప్పటికే మూసివేశామని టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తామని జగన్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధులకు జాగ్రత్తలు  తీసుకున్నామని చెప్పారు. 

అత్యవసర సరుకుల్ని బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కృత్రిమ కొరత సృష్టించొద్దని జగన్ విజ్ఞప్తి చేశారు. ఏ వస్తువును ఏ ధరకు అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, అంతకుమించి ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. 31 వరకు అందరూ ఇళ్లల్లో కూర్చోగలిగితే కరోనా వైరస్‌ను తరిమికొట్టగలమని జగన్ అన్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాల్లో లాక్ డౌన్ కు కేంద్రం ఆదేశాలు

పదిమందికి మించి ప్రజలెవ్వరూ గుమికూడవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఖచ్చితంగా 14 రోజులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలన్నారు.

వీలైనన్ని తక్కువ రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1,000 ఆర్ధిక సాయం చేస్తామని జగన్ తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం వెల్లడించారు. 

click me!