రెండు నెలల తర్వాత: రేపటి నుంచి విధులకు హాజరుకానున్న ప్రభుత్వ ఉద్యోగులు

By Siva KodatiFirst Published May 20, 2020, 6:39 PM IST
Highlights

కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఏపీ ప్రభుత్వోద్యోగులు రేపటి నుంచి విధులకు హాజరుకానున్నారు. 

కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఏపీ ప్రభుత్వోద్యోగులు రేపటి నుంచి విధులకు హాజరుకానున్నారు. గురువారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో యధావిధిగా ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో మాస్క్ లేకుండా ఏ ఉద్యోగి కూడా విధులకు హాజరు కాకూడదని హెచ్చరించింది.

కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారు, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితుల ఆధారంగా వర్క్ ఫ్రమ్ హోంకు ప్రభుత్వం అనుమతించింది. భౌతికంగా పంపించే దస్త్రాలను సాధ్యమైనంత తగ్గించాలని.. ఈ ఫైళ్ల ద్వారా దస్త్రాలను పంపుకోవాలని తెలిపింది. 

Also Read:

ఎల్జీ పాలీమర్స్‌కు కాంగ్రెస్, వైసీపీ అనుమతులు, ఇవిగో ఆధారాలు: జగన్ కు బాబు సవాల్

రోజా సహా ఎమ్మెల్యేలకు షాక్: లాక్ డౌన్ ఉల్లంఘనలపై హైకోర్టు సీరియస్ కామెంట్

click me!