ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల ఓనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సీజ్ చేసిన థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే నెల రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను అమలు చేయాలని కోరింది.
అమరావతి: Andhra pradesh రాష్ట్రంలో Cinema థియేటర్ల ఓనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీజ్ చేసిన Theatres ఓపెన్ చేసుకొనేందుకు అనుమతిని ఇచ్చింది.ప్రభుత్వం ఆదేశించిన నిబంధనల మేరకు నెల రోజుల్లో అన్ని వసతులను కల్పించాలని ప్రభుత్వం థియేటర్ల ఓనర్లకు సూచించింది. ఏపీ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 83 థియేటర్లను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సుమారు 83థియేర్లను సీజ్ చేశారు. అయితే పలు రకాల కారణాలతో ఈ థియేటర్లను సీజ్ చేశారు.. ప్రభుత్వం సూచించినట్టుగా వసతులను సినిమా థియేటర్లలో కల్పించలేదు. దీంతో ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు సవయం ఇచ్చింది. అయినా వారిలో మార్పు రాకపోవడంతో సినిమా థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వసతులు లేని సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు.
అయితే కొన్ని సినిమా థియేటర్లకు లైసెన్సులు కూడా రెన్యూవల్ చేసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినానితో సమావేశమయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా టికెట్ల ధరలను పెంచుకొనేందుకు అవకాశం ఇవ్వాలని కూడా కోరారు.
ఈ మేరకు టికెట్ల ధరల పెంపు ప్రతిపాదనలన కూడా మంత్రికి అందించారు. సినిమా థియేటర్లలో తనిఖీల విషయమై కూడా సినిమా థియేటర్ల యజమానులు మంత్రితో చర్చించారు. కనీస వసతులు మెరుగుపర్చాలని మంత్రి సినిమా థియేటర్ల యజమానులకు తేల్చి చెప్పారు.ఈ విషయమై ప్రభుత్వం సమయం ఇచ్చినా కూడా స్పందించని విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ఈ సమావేశంలో సినిమా థియేటర్ల యజమానుల వినతి మేరకు ఆయా థియేటర్లలో కనీస వసతులను మెరుగుపర్చేందుకు నెల రోజులను ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ధరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 జీవోను తీసుకువచ్చారు. సినిమా టికెట్ల ధరలను తగ్గించారు. అయితే సినిమా టికెట్ల ధరల తగ్గింపును సినీ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవాలని భావిస్తున్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు ఈ విషయమై తనను సంప్రదించలేదని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. నిర్మాతలు నేరుగా సీఎంఓను సంప్రదించారేమో తనకు తెలియదన్నారు.
also read:ఏ కిరాణా కొట్టు గురించి మాట్లాడారో:హీరో నానికి మంత్రి పేర్ని నాని కౌంటర్
సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయమై సీనీ హీరోలు నాని, సిద్దార్ద్ లు చేసిన విమర్శలపై కూడా ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు సహా ఇతర విషయాలపై కూడ రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్దంగా ఉందని మంత్రి పేర్నినాని సినీ పరిశ్రమకు సూచించారు.సినిమా టికెట్ల ధరల పెంపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ీ విషయమై బహిరంగంగానే ఏపీ సర్కార్ పై విమర్శలు చేశారు. తనను లక్ష్యంగా చేసుకొని ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయన్నారు.