దేశంలో అందరికీ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
అమరావతి:దేశంలో అందరికీ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
గురువారం నాడు గుంటూరులోని 140 వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత సీఎం జగన్ ప్రసంగించారు.45 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయిస్తామన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేస్తామని ఆయన తెలిపారు.
also read:గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్న ఏపీ సీఎం జగన్ దంపతులు
వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి 45 ఏళ్లు దాటినవారి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ఏ రోజు వ్యాక్సినేషన్ జరుగుతుందో ముందుగానే వాలంటీర్లు చెబుతారన్నారు. ప్రతి మండలంలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు.వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు ఇచ్చిన వివరాల మేరకు వ్యాక్సినేషన్ చేయనున్నట్టుగా సీఎం తెలిపారు. వ్యాక్సిన్ వేసుకొనేందుకు ముందుకు రాకుంటే ప్రతి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తారన్నారు.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.