ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిలు గురువారం నాడు కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు.
గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిలు గురువారం నాడు కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు.
గురువారంనాడు గుంటూరు పట్టణంలోని భారత్‌పేట 6వ లైన్‌లోని 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. వ్యాక్సిన్ వేసుకొన్న తర్వాత జగన్ దంపతులు అరగంటపాటు అబ్జర్వేషన్ లో ఉన్నారు.
undefined
కరోనా వ్యాక్సిన్ వేసుకొనేందుకు వచ్చిన సీఎం దంపతులకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో వార్డు, గ్రామ సచివాలయాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో 45 ఏళ్లు దాటినవారికి కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.తొలుత సీఎం వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు.జగన్ దంపతులు వ్యాక్సిన్ వేసుకోవడానికి 140 వార్డు సచివాలయానికి చేరుకోవడంతో ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.
దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.