హత్య కేసులో నిందితుడికి కరోనా: ఆసుపత్రిలో చికిత్స, అర్థరాత్రి గప్‌చుప్‌గా పరార్

By Siva KodatiFirst Published Apr 23, 2021, 4:36 PM IST
Highlights

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాజిటివ్ వున్న రిమాండ్ ఖైదీ విజయ్ పరారయ్యాడు. రిమ్స్ రెండో అంతస్తులో వున్న ప్రిజనర్ వార్డులో ఇనుప కిటికీ తొలగించిన అతను తప్పించుకున్నాడు.

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాజిటివ్ వున్న రిమాండ్ ఖైదీ విజయ్ పరారయ్యాడు. రిమ్స్ రెండో అంతస్తులో వున్న ప్రిజనర్ వార్డులో ఇనుప కిటికీ తొలగించిన అతను తప్పించుకున్నాడు.

రాత్రి ఎస్కార్ట్ సిబ్బంది రూమ్ బయట వున్న సమయంలో ఖైదీ లోపల చాకచక్యంగా కిటికీ ఇనుప చువ్వలు తొలగించాడు. ఈ నెల 14 న టంగుటూరు మండలం మర్లపూడి వద్ద నాగరాజు అనే ఆటోడ్రైవర్ హత్య కేసులో విజయ్ నిందితుడిగా వున్నాడు.

కోర్ట్ రిమాండ్ విధించింది. జైలుకు తరలించే క్రమంలో చేసిన కరోనా పరీక్షల్లో విజయ్‌కి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read:కరోనా ఉగ్రరూపం: ప్రకాశం జిల్లాలో లాక్‌డౌన్ ... 19 ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు

మరోవైపు ప్రకాశం జిల్లాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలోని 19 ప్రాంతాలను గుర్తించారు. ఒంగోలు నగరం సహా కందుకూరు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరుతో పాటు మండల కేంద్రాల్లో ఆంక్షలు విధించాలని కలెక్టర్ నిర్ణయించారు.

జిల్లాలోని 19 ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇచ్చినట్లుగా కలెక్టర్ వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఏ రోజుకారోజు కొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా తీవ్రత అధికంగా వున్న మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్ రాష్ట్రాలతో ఏపీ పోటీ పడేందుకు సిద్ధంగా వున్నట్లుగా అనిపిస్తోంది.

click me!