మరోసారి దూళిపాళ్ల ఇంటికి ఏసిబి అధికారులు

By Arun Kumar PFirst Published Apr 23, 2021, 2:13 PM IST
Highlights

శుక్రవారం ఉదయమే టిడిపి నాయకులు దూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసి బాపట్లకు తరలించిన ఏసిబి పోలీసులు మరోసారి ఆయన ఇంటికి వెళ్లారు.

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామునే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసి బాపట్లకు తరలించిన ఏసిబి పోలీసులు మరోసారి నరేంద్ర ఇంటికి వెళ్లారు. దూళిపాళ్ల కుటుంబసభ్యులకు ఏసీబీ  సీఐ అపర్ణ మరోసారి నోటీసులు అందించారు. 

ఉదయం దూళిపాళ్లను అరెస్ట్ చేసిన అనంతరం కుటుంబసభ్యులకు ఇచ్చిన నోటీసుల్లో నరేంద్ర పేరుకు బదులు గురునాధం అనే పేరు వుంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు నోటిసుల్లో పేరును సరిచేసి నరేంద్ర పేరు చేర్చారు. ఈ నోటీసులను అందించడానికే మరోసారి దూళిపాళ్ల ఇంటికి వెళ్లారు ఏసిబి పోలీసులు. 

read more  అమూల్ కోసమే దూళిపాళ్ళ టార్గెట్...బందిపోటు, గూండాలా అరెస్ట్: దేవినేని ఉమ

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్రను ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. కారణం చెప్పకుండా నరేంద్రను అరెస్టు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలియక నరేంద్ర కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. 

ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. సంగం డెయిరీలో అవకతవకలపై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ విషయంపై విచారణ నిమిత్తం నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు.

ధూళ్లిపాళ్ల నరేంద్రపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. నరేంద్ర అరెస్టును అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కారులో ఎక్కించుకుని ఆయనను తీసుకుని వెళ్లారు. చింతలపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి ఆయనను అక్కడి నుంచి తరలించారు.

నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తన నోటీసులో చెప్పింది. 

click me!