ఆదుకోకుంటే...కుటుంబంతో కలిసి ఆత్మహత్య: పూజారి సెల్ఫీ వీడియో

By Arun Kumar PFirst Published Jul 29, 2020, 9:06 PM IST
Highlights

కరోనా కారణంగా ఆలయం మూతపడి తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ ఓ ఆలయ పూజారి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్న సెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రకాశం: కరోనా కారణంగా ఆలయం మూతపడి తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని... రెండు నెలల నుండి జీతం కూడా రాలేదంటూ చీరాలకు చెందిన ఓ పూజారి ఆవేదన వ్యక్తం చేశారు. చీరాలలోని బోస్ నగర్ అంజనేయస్వామి దేవాలయ పూజారిగా పనిచేసే చక్రవర్తి సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.    

చాలీచాలని జీతాలతో సాగుతున్న తమ జీవితాలను కరోనా మరింత దుర్భరం చేసిందని పూజారి అన్నారు. రెండు నెలలుగా జీతాలు రాలేవని... దీంతో బయట అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చిందన్నారు. తన సరిస్థితిని చీరాల ఎండో మెంట్ అధికారికి విన్నవించినా పట్టించుకోలేదని... కనీసం ప్రభుత్వం ప్రకటించిన రూ.5000 సాయం కూడా అందించలేదని అన్నారు. 

వీడియో

"

 తమ సమస్య పరిష్కరించకుంటే  కుటుంబంతొ సహా ఆత్మహత్యకు చేసుకోవాల్సి వస్తుందన్నారు. కాబట్టి ప్రభుత్వం, దేవాదాయ శాఖ తమను ఆదుకోవాలంటూ  చీరాల ఆంజనేయస్వామి దేవాలయ పూజారి చక్రవర్తి సెల్ఫీ వీడియో ద్వారా కోరారు.  
 

click me!