కరోనా సాయం కోసం మహిళ ఆవేదన... వాలంటీర్ కు కోర్టు నోటీసులు

By Arun Kumar PFirst Published Jul 29, 2020, 8:32 PM IST
Highlights

కరోనా సాయం అందక ఓ నిరుపేద మహిళ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కోర్టు సీరియస్ అయ్యింది.

శ్రీకాకుళం: కరోనా కష్టకాలంలో ప్రభుత్వం అందించిన ఉచిత రేషన్, ఆర్థిక సాయం  ఎంతోమంది నిరుపేద కుటుంబాల ఆకలిభాదను తీర్చింది. అయితే ఈ సాయం  అందక ఓ నిరుపేద మహిళ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కోర్టు సీరియస్ అయ్యింది. సుమోటోగా విచారణను చేపట్టిన న్యాయస్ధానం గ్రామ వాలంటీర్ కు నోటీసులు జారీ చేసింది. 

ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. మేఘవరం పంచాయతీ యంపల్లివానిపేటకు చెందిన కొర్లమ్మ గత నాలుగు నెలల తనకు రేషన్‌ బియ్యం సక్రమంగా అందించడం లేదని తెలిపింది. అంతేకాకుండా ప్రభుత్వ కరోనా సాయం రూ.1000 ఇప్పటి వరకు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తన ఆవేదనను తెలియజేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

read more  సీఎం మాటలు... పుట్టెడు దు:ఖంలోనూ మానవత్వాన్ని చాటిన తల్లీ కొడుకులు: మంత్రి నారాయణ

దీనిపై ఈనెల 23వ తేదీన ఓ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కోటబొమ్మాళి సివిల్‌ కోర్టు న్యాయమూర్తి సుమోటో వ్యాజ్యంగా స్వీకరించి యంపల్లివానిపేట గ్రామ వాలంటీర్‌కు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీలోగా సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
 

click me!