విశాఖ ‘టిడిపి’లో ముసలం తప్పదా?

Published : Jun 04, 2017, 09:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
విశాఖ ‘టిడిపి’లో ముసలం తప్పదా?

సారాంశం

చంద్రబాబు పరిస్ధితిని ఇద్దరు అవకాశంగా తీసుకుని ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య జిల్లా పార్టీ గందరగోళంలో పడింది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేక మధ్యలో నేతలు అవస్తలు పడుతున్నారు. 

విశాఖపట్నం జిల్లా టిడిపిలో ముసలం పుట్టింది.  ఇద్దరు మంత్రుల మధ్య వివాదాలు పీక్ స్టేజ్ కు చేరుకోవటం పార్టీ మొత్తాన్ని గందరగోళంలోకి నెట్టేస్తోంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మొదటి నుండి పడదు. దాంతో గంటా టిడిపిలో ఇమడలేక వైసీపీకి వెళ్లి అటునుండి కాంగ్రెస్ లో చేరి మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ టిడిపిలోకి వచ్చారు.

అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అదే ఇపుడు పార్టీ పుట్టిముంచేలా ఉంది. తాజాగా బయటపడిన రూ. 25 వేల కోట్ల భూ కుంభకోణంలో గంటా బ్యాచ్ ను లక్ష్యంగా చేసుకోవాలని చింతకాయల డిసైడ్ అయినట్లున్నారు. తాజగా బయటపడిన భూ కుంభకోణానికి గంటానే కేంద్రబిందువుగా ప్రచారం జరుగుతోంది. దాంతో పార్టీ, ప్రభుత్వంలో కలకలం రేగుతోంది. అందుకే చంద్రబాబు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా గంటాపై  రెచ్చిపోతున్నారు.

ఇద్దరిలో ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేసుకుంటూనే ఉంటారు. ఇపుడు చింతకాయలకు అవకాశం వచ్చింది. ఇద్దరిలో ఏ ఒక్కరిని పక్కనపెట్టాలన్నా చంద్రబాబునాయుడుకు సాధ్యంకాదు. ఎందుకంటే, చింతకాయలేమో తొలినుండి టిడిపిలోనే ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని వీడలేదు. పైగా చంద్రబాబు, లోకేష్ కు బాగా సన్నిహితుడన్న ప్రచారం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా జిల్లా పార్టీ మద్దతు  చింతకాయలకే.

ఇక, గంటా సంగతలా కాదు. ఆయనలో రాజకీయనేత కన్నా పవర్ బ్రోకర్నే ఎక్కువగా చూస్తారు జనాలు. ఎందుకంటే, అధికారం కోసం అనేక పార్టీలు మారారు. ఏ పార్టీలో ఉన్నా తనకు, తన వర్గానికి టిక్కెట్లు తెచ్చుకుంటారు. పార్టీ అధికారంలోకి రాగానే మంత్రిపదవీ తప్పదు. అనేక వ్యాపారాలున్నాయి. దాంతో పార్టీని, నేతలను పెద్దగా పట్టించుకోరు.

దానికితోడు సహచర మంత్రి, చంద్రబాబుకు బాగా సన్నిహితుడైన నారాయణకు వియ్యంకుడు. దాంతో ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. అందుకని, గంటాపై చర్యలు తీసుకోవాలన్నా చంద్రబాబుకు సాధ్యం కాదు. ఎవరిమీద చర్యలు తీసుకున్నా పరిస్ధతిలు ఎలాగుంటాయో ఊహించలేకున్నారు. దాంతో చంద్రబాబు అవస్తలు పడుతున్నారు. ఓవైపు వైసీపీ పుంజుకుంటోందన్న ప్రచారం, మరోవైపు పార్టీలో తీవ్రస్ధాయిలో గొడవలు. దాంతో ఏం చేయాలో చంద్రబాబు అర్ధం కావటం లేదు.

చంద్రబాబు పరిస్ధితిని ఇద్దరు అవకాశంగా తీసుకుని ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య జిల్లా పార్టీ గందరగోళంలో పడింది. ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేక మధ్యలో నేతలు అవస్తలు పడుతున్నారు. ఎన్నికల సమీపిస్తున్నసమయంలో వీరిద్దరి మధ్య తీవ్రస్ధాయికి చేరుకున్న వివాదాలు చివరకు పార్టీ పుట్టిముంచుతుందేమోనని అందరు ఆందోళన పడుతున్నారు.    

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే