మంత్రిపదవి పోయినా పర్వాలేదు

Published : Jun 03, 2017, 06:35 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
మంత్రిపదవి పోయినా పర్వాలేదు

సారాంశం

విశాఖపట్నం జిల్లాలోని మంత్రులిద్దరి వ్యవహారం చంద్రబాబునాయుడు తలనొప్పిగా తయారైంది. గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడికి అస్సలు పడదు. దానికితోడు జిల్లాలో జరిగిన భూ కుంభకోణానికి గంటా కేంద్రబిందువుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని అవకాశంగా తీసుకున్న చింతకాయల రెచ్చిపోతున్నారు.

విశాఖపట్నం జిల్లాలోని మంత్రులిద్దరి వ్యవహారం చంద్రబాబునాయుడు తలనొప్పిగా తయారైంది. గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడికి అస్సలు పడదు. దానికితోడు జిల్లాలో జరిగిన భూ కుంభకోణానికి గంటా కేంద్రబిందువుగా ప్రచారం జరుగుతోంది.

దాన్ని అవకాశంగా తీసుకున్న చింతకాయల రెచ్చిపోతున్నారు. అందుకే చంద్రబాబు ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా గంటా పేరు ఎత్తకుండానే రెచ్చిపోయి ఆరోపణలు, సవాళ్ళు విసురుతున్నారు చింతకాయల.

చివరకు తన మంత్రి పదవిని వదులుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చింతకాయల తాజాగా చెప్పటం సంచలనంగా మారింది. విశాఖపట్నం జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై నిజాలు మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పటం పార్టీ, ప్రభుత్వంలో సంచలనంగా మారింది. భూ కుంభకోణంపై చింతకాయల మొదటినుండి చంద్రబాబునాయుడు ఆదేశాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారు.

జిల్లాలోని దాదాపు నాలుగు నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ. 25 వేల కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని మంత్రి ఆరోపించటం పార్టీ, ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. భూ కుంభకోణానికి భీమిలీ నియోజకవర్గం కేంద్రంగా ఉండటంతో పార్టీలో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేకున్నారు.

ఎందుకంటే, భీమిలీ నియోజవకర్గానికి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అందరకీ తెలిసిందే కదా? దానికితోడు గంటాకు, చింతకాయలకు ఉప్పు-నిప్పు.

ఇపుడు ఇద్దరి మంత్రులకు ఏమాత్రం పొసగని  అంశమే చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకుంటోంది. ఈరోజు నర్సీపట్నంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చింతకాయల మాట్లాడుతూ, ‘తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని, దీనిపై తనకు నష్టం జరిగినా లెక్క చేయను’ అంటూ వేదికమీదనే చెప్పటం గమనార్హం. ఈ విషయంలో అవసరమైతే మంత్రిపదవి కూడా వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

భూ దోపిడీదారులను తరిమికొట్టేందుకు విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు కూడా మంత్రి చెప్పారు. పనిలో పనిగా ఉపాధ్యాయుల గురించి కూడా మాట్లాడారు. ప్రభుత్వం వద్ద జీతాలు తీసుకుంటూ కూడా నర్పీపట్నంలో వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నట్లు మండిపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu