తెలంగాణ నుండి కారులో అక్రమంగా మద్యం: కానిస్టేబుల్ అరెస్ట్

Published : Nov 09, 2020, 09:46 PM IST
తెలంగాణ నుండి కారులో అక్రమంగా మద్యం: కానిస్టేబుల్ అరెస్ట్

సారాంశం

తెలంగాణ నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మద్దిరాల శ్రీనివాస్ ను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడ: తెలంగాణ నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మద్దిరాల శ్రీనివాస్ ను సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇండికాలో మద్యం తీసుకొస్తున్న మద్దిరాల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ కారులో 220 మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఏపీ రాష్ట్రంలోకి తెలంగాణ నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూడ మద్యం ధరలను తగ్గించింది. 

also read:మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్: లిక్కర్ ధరలను తగ్గించిన ఏపీ సర్కార్

ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం సీసాలను తీసుకురావడాన్ని కూడ ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేసింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మద్యం రాష్ట్రంలోకి  అక్రమంగా మద్యం తీసుకురాకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

మద్దిరాల శ్రీనివాస్ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్ గా ఉంటూ  శ్రీనివాస్ మద్యం బాటిల్స్ అక్రమంగా తీసుకెళ్లడంపై పోలీసు శాఖ సీరియస్ గా ఉంది. శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu