ఉగ్రవాదుల కాల్పుల్లో చిత్తూరు జిల్లా జవాన్ మృతి: రూ. 50 లక్షలు ప్రకటించిన జగన్

Published : Nov 09, 2020, 09:10 PM IST
ఉగ్రవాదుల కాల్పుల్లో చిత్తూరు జిల్లా జవాన్ మృతి: రూ. 50 లక్షలు ప్రకటించిన జగన్

సారాంశం

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన బీఎస్ఎఫ్ హవాల్దార్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.


అమరావతి: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన బీఎస్ఎఫ్ హవాల్దార్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గత 19 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్ లో పనిచేస్తున్నాడు.

also read:ఉగ్రవాదుల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ మహేష్ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి

ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు లేఖ రాశాడు. ఈ సమయంలో మీ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని సీఎం సహాయ నిధి నుండి రూ. 50 లక్షలు అందిస్తున్నట్టుగా జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబసభ్యులను డీప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప , ఎమ్మెల్యే ఎంఎస్ బాబులు సోమవారం నాడు పరామర్శించారు.

ఆదివారం నాడు జమ్మూలోని మచిల్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ రెడ్డిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆయన మరణించిన విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Andhra pradesh: ఏపీలో మరో హైటెక్ సిటీ.. కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం, మరిన్ని సంస్థలు