24 గంటల్లో తూ.గోదావరిలో అత్యధికం, కర్నూల్‌లో అత్యల్పం: ఏపీలో 8,44,359కి చేరిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published Nov 9, 2020, 6:36 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1392 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 44వేల359 కి చేరుకొన్నాయి. 
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1392 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 44వేల359 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 11మంది కరోనా మరణించారు.కరోనాతో కృష్ణా జిల్లాలో ఐదుగురు, కడపలో ఇద్దరు, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,802 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 87లక్షల 25వేల 025 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 61,050 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1392 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 16వేల 322 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 21,235యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 84,చిత్తూరులో 105,తూర్పుగోదావరిలో 341, గుంటూరులో 116 కడపలో100, కృష్ణాలో 075, కర్నూల్ లో 036, నెల్లూరులో 076, ప్రకాశంలో 066, శ్రీకాకుళంలో 047, విశాఖపట్టణంలో 042, విజయనగరంలో 061,పశ్చిమగోదావరిలో 243కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -65,662, మరణాలు 579
చిత్తూరు  -80,871మరణాలు 796
తూర్పుగోదావరి -1,18,930 మరణాలు 620
గుంటూరు  -69,712, మరణాలు 632
కడప  -53,214,మరణాలు 444
కృష్ణా  -41,879 మరణాలు 594
కర్నూల్  -59,758 మరణాలు 482
నెల్లూరు -60,440, మరణాలు 488
ప్రకాశం -60,554మరణాలు 574
శ్రీకాకుళం -44,728 మరణాలు 344
విశాఖపట్టణం  -56,817 మరణాలు 518
విజయనగరం  -39,980 మరణాలు 230
పశ్చిమగోదావరి -88,919 మరణాలు 507

 

: 09/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,41,464 పాజిటివ్ కేసు లకు గాను
*8,13,427 మంది డిశ్చార్జ్ కాగా
*6,802 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 21,235 pic.twitter.com/GoARyqATy2

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!