ఐవైఆర్ మ‌రోసారి చంద్ర‌బాబుకు లేఖ‌

Published : Aug 16, 2017, 05:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఐవైఆర్ మ‌రోసారి చంద్ర‌బాబుకు లేఖ‌

సారాంశం

బ్రాహ్మ‌ణుల‌కు జీతాలు త‌గ్గించ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు ఐవైఆర్. హిందూ మతాన్ని దెబ్బతీయడానికి బయటి శత్రువులు అక్కర్లేదని ఆయన లేఖలో పెర్కొన్నారు. ఇలా చేస్తే  గ్రామాల్లో హిందుత్వం కనిపించకుండా పోతుందని ఆవేధన

 ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, ప్ర‌భుత్వం బ్రాహ్మ‌ణుల‌కు జీతాలు త‌గ్గించ‌డాన్ని త‌ప్పుప‌ట్టారు. అర్చకుల వేతనాలను రూ. 10వేల నుంచి రూ. 5వేలకు తగ్గించడం సరికాదని లేఖలో ఆయన పేర్కొన్నారు. హిందూ మతాన్ని దెబ్బతీయడానికి బయటి శత్రువులు అక్కర్లేదని, గ్రామాల్లో హిందుత్వం కనిపించకుండా పోవడానికి ఇలాంటి ఆలోచనలు చాలని ఐవైఆర్‌ తన లేఖలో తెలిపారు.


 సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ. 250 కోట్లతో ఫండ్ ఏర్పాటయిందన్నారు ఐవైఆర్‌. ఇతర ఆలయాల కంట్రిబ్యూషన్ కలిపితే రూ. 500 కోట్ల ఫండ్ ఉందన్నారు. అయితే ఆ నిధులతో అర్చకులకు రూ. 10వేల జీతం ఇవ్వవచ్చని సూచించారు. అర్చకుల జీతాల్లో కోత విధించడం సరికాదని అన్నారు. చినజీయర్ లాంటి ట్రస్టులు కూడా అర్చకులకు నెలకు రూ. 20వేల వేతనాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఆదాయం లేని ఆలయాల్లో పని చేసే అర్చకులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐవైఆర్ ఈ లేఖను చంద్ర‌బాబుకు రాశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్