
ఆంద్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్న సమయంతో నంద్యాల ఉపఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ జోక్ పేల్చింది. ఒక వైపు ఆధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షాలు తమ బలమైన క్యాడర్ తో రంగంలోకి దిగగా, తాము కూడా బలమైన ప్రత్యర్థులమే అని కాంగ్రెస్ ప్రకటించడం హాస్యాస్పదంగా మారింది. అసలు ఉనికే లేని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం పెద్ద కామెడీగా మారింది.
పార్టీ తరపున అభ్యర్థిని నిలపనున్నట్లు ఏపీ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మునియప్పతో కలిసి ఆంధ్రరత్న భవన్‌లో మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్రంలోని అన్ని నగరాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం పెద్ద చర్చకు దారితీసింది.వారికి నంద్యాల ఎన్నికలకు ఏం సంబందముందో ఎంత ఆలోచించినా అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయినా అంత బలమైన అభ్యర్థిని నిలబెడితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో తేలనుంది.
అధికార పార్టీ, ప్రతిపక్షాలు రెండూ ప్రజల సమస్యలను గాలికొదిలేసాయని రఘువీరా ఎద్దేవా చేసారు. పాదయాత్ర చేపడతానని చెప్పడం ద్వారా, ఎన్నికల వరకు ప్రజా సమస్యలను పట్టించుకోనని జగన్ చెప్పకనే చెప్పారని విమర్శించారు.
నంద్యాలలో కాంగ్రెస్ తరపున గెలుపు గుర్రాన్ని నిలబెట్టి తమ ఉనికిని చాటుకుంటామని మునియప్ప కూడా కామెడీ చేసారు.