విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ.. వచ్చే నెలలో రాహుల్ రాక..!!

Published : Jul 22, 2023, 11:49 AM IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ.. వచ్చే నెలలో రాహుల్ రాక..!!

సారాంశం

విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మార్చ్ నిర్వహించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల పోరాటానికి మద్దతుగా శనివారం ఉదయం జింక్‌ గేటు నుంచి కూర్మన్నపాలెంలో గల నిరశన దీక్షా శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు.

వైజాగ్: విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మార్చ్ నిర్వహించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల పోరాటానికి మద్దతుగా శనివారం ఉదయం జింక్‌ గేటు నుంచి కూర్మన్నపాలెంలో గల నిరశన దీక్షా శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. సేవ్ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పేరుతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, ఇతర కాంగ్రెస్ శ్రేణులు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ  సమితి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 

Also Read: భీమవరం నుంచే పవన్ కల్యాణ్ పోటీ!.. జగన్ తో ఢీకి వ్యూహం ఇదే...

ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా విశాఖలో వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తుందని.. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఉద్యమానికి రాహుల్ మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణనను చేపట్టబోమని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం