కారు నడుపుతూ నిద్రమత్తు.. తండ్రీ, కొడుకు మృతి.. కుమారిడికి సెండాఫ్ ఇచ్చి వస్తుండగా ఘటన...

By SumaBala BukkaFirst Published Jan 28, 2022, 9:53 AM IST
Highlights

ఉన్నత చదువులకు చిన్న కొడుకును అమెరికాకు సాగనంపి తిరిగి వస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. తండ్రి, పెద్ద కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం జాగర్లమూడి వారిపాలెం వద్ద ఈ incident చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట లంబాడీడొంకకు చెందిన చౌడా వెంకట్రావు (55),  కళావతి దంపతుల పెద్ద కుమారుడు ప్రసన్న (26)  సాఫ్ట్వేర్ ఇంజనీర్. work from home కారణంతో ఇంటి వద్దే ఉంటున్నాడు.

మంగళూరు : క్షణాల్లో వారి జీవితాలు తలకిందులయ్యాయి. ఎన్నో ఆశలతో అమెరికా విమానం ఎక్కిన ఆ యువకుడు అక్కడ దిగేసరికి తండ్రీ, అన్నా ఇక లేరన్న వార్తను వినాల్సి వచ్చింది. కొడుకు బంగారు భవిష్యత్తు కోసం విదేశాలకు పంపిన ఆ తల్లి.. భర్తను, పెద్ద కొడుకును కోల్పోయి.. అనాథగా మారిపోయింది. ఈ దారుణ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. 

ఉన్నత చదువులకు చిన్న కొడుకును americaకు సాగనంపి తిరిగి వస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. తండ్రి, పెద్ద కుమారుడు దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం జాగర్లమూడి వారిపాలెం వద్ద ఈ incident చోటు చేసుకుంది.  గుంటూరు జిల్లా చిలకలూరిపేట లంబాడీడొంకకు చెందిన చౌడా వెంకట్రావు (55),  కళావతి దంపతుల పెద్ద కుమారుడు ప్రసన్న (26)  సాఫ్ట్వేర్ ఇంజనీర్. work from home కారణంతో ఇంటి వద్దే ఉంటున్నాడు.

చిన్న కుమారుడు భాస్కర్ కు అమెరికాలో చదువుకునే అవకాశం వచ్చింది. అతడిని flight ఎక్కించి వీడ్కోలు చెప్పేందుకు, తల్లిదండ్రులు, సోదరులు బుధవారం రాత్రి  chennai చేరుకున్నారు. భాస్కర్ విమానం ఎక్కాక… వీరు carలో తిరుగు ప్రయాణం అయ్యారు. గురువారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు జాగర్లమూడి వారిపాలెం హైవే వంతెన సమీపంలో ముందు వెళ్తున్న కట్టెల ట్రాక్టర్ ను వీరి కారు బలంగా ఢీ కొట్టింది. కారు ఒక భాగం ట్రాక్టర్ ట్రక్కు కిందికి దూసుకెళ్లడంతో..  ఆ వైపు కూర్చున్న   వెంకట్రావు,  ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్, ఆ  వెనక సీట్లో ఉన్న కళావతి ప్రాణాలతో బయట పడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా గా భావిస్తున్నారు.

కాగా, జనవరి 22న ఒడిశాలో ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలాసోర్ జిల్లాలోని సోరో పోలీసు స్టేషన్ పరిధిలో NH-16‌పై బిదు చక్ వద్ద బస్సును బొగ్గు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ‘శాంతిలత’ అనే పేరుతో ఉన్న బస్సు Mayurbhanj districtలోని మనత్రి నుంచి ఉడాలా మీదుగా భువనేశ్వర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

శనివారం మధ్యాహ్నం సమయంలో సోరో సమీపంలోని బస్ స్టాప్ వద్ద బస్సు ఆగి ఉన్న సమయంలో.. బొగ్గుతో కూడి ట్రక్కు వేగంగా దూసుకొచ్చి వెనకాల నుంచి బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి పక్కకు పడిపోయింది. దీంతో ఘటన స్థలంలోనే ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉన్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని సోరోలోని ఆస్పత్రి, బాలసోర్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

click me!