ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఎలా.. జగన్ సర్కార్ తర్జనభర్జనలు, రేపు క్లారిటీ

Siva Kodati |  
Published : Feb 18, 2023, 06:25 PM IST
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఎలా.. జగన్ సర్కార్ తర్జనభర్జనలు, రేపు క్లారిటీ

సారాంశం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది . 13 రోజుల బడ్జెట్ సమావేశాలపై రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం వుంది.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఈ నెల 27నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అదే రోజు గవర్నర్ ప్రసంగం వుండే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ మార్చి 6 నుంచి సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది ఏపీ ప్రభుత్వం. 13 రోజుల బడ్జెట్ సమావేశాలపై రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం వుంది. మార్చి 3 , 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు ఇబ్బందులు లేకుండా వుండేందుకు మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ సమావేశాలకు విరామం ఇవ్వనుంది ప్రభుత్వం. కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టాక బడ్జెట్ సమావేశాలపై క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు