జంపింగ్‌లకు, సైకోలకు ఆదిపురుషుడు.. మేం బూతులు తిట్టలేమా : చంద్రబాబుపై వల్లభనేని వంశీ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 18, 2023, 05:42 PM IST
జంపింగ్‌లకు, సైకోలకు ఆదిపురుషుడు.. మేం బూతులు తిట్టలేమా : చంద్రబాబుపై వల్లభనేని వంశీ వ్యాఖ్యలు

సారాంశం

జంపింగ్ జపాంగ్‌లు, సైకోలకు చంద్రబాబు నాయుడు ఆదిపురుషుడని అన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వ్యక్తిత్వ హననం చేసేలా మార్ఫింగ్ చేసిన ఫోటోలు, పాటలను పెట్టి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. శనివారం ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్ద సైకో అయితే లోకేష్ పిల్ల సైకో అంటూ వ్యాఖ్యానించారు. లోకేష్ కనుసన్నల్లో నడిచే ఐ టీడీపీనే తనపై ట్రోలింగ్స్ చేస్తోందని వల్లభనేని వంశీ ఆరోపించారు. పకోడిగాళ్లంతా తనకు డిపాజిట్ రాకుండా చేస్తామంటున్నారని.. సైకోలందరికీ చంద్రబాబు ఆదిపురుషుడని ఆయన మండిపడ్డారు. వ్యక్తిత్వ హననం చేసేలా మార్ఫింగ్ చేసిన ఫోటోలు, పాటలను పెట్టి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ ఇంట్లోనూ ఆడవాళ్లున్నారని.. పలావ్ ప్యాకెట్లకు, డీజీల్‌కు ఆశపడి కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను కూడా బూతులు తిట్టగలనని హెచ్చరించారు. తాను జంపింగ్‌ జపాంగ్‌నైతే చంద్రబాబు ఎవరని వంశీ ప్రశ్నించారు. ఆయనకు తొలుత కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ టికెట్ ఇచ్చారని .. అక్కడ మంత్రి పదవులు అనుభవించి తెలుగుదేశంలోకి జంపింగ్ అయినోళ్లు జంపింగ్ జపాంగ్ కాదా అని ఎద్దేవా చేశారు. 

ALso REad: గుడివాడలో నాని, గన్నవరంలో నేను .. మా వెంట్రుక కూడా పీకలేరు : చంద్రబాబును ఉద్దేశించి వల్లభనేని వంశీ వ్యాఖ్యలు

తాటాకు చప్పులకు తాను భయపడనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, ఖర్జూర నాయుడు ఎంతమంది వచ్చినా నన్ను, నానిని వెంట్రుక  కూడా పీకలేరని వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టాభి కోర్టు పనిపై  గన్నవరం వస్తాడని అప్పుడు చెబుతానని హెచ్చరించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు భూమి కదిలిపోయిందని వల్లభనేని ఎద్దేవా చేశారు. ఉడుత ఊపులకు తాము భయపడమని.. తాను, నాని తెలుగుదేశం స్కూల్ లో చదువుకున్నవాళ్లమేనని వంశీ స్పష్టం చేశారు. 

తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌లు అయ్యామని ఆయన అన్నారు. గన్నవరం, గుడివాడ నియోజవర్గాల్లో చంద్రబాబు,‌లోకేష్‌లు పోటీ చేయొచ్చు కదా అని వంశీ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున తాను పోటీ చేస్తానని వల్లభనేని తేల్చిచెప్పేశారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు వైసిపి పెట్టిన తర్వాత చేరిన వారేనని ఆయన గుర్తుచేశారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయిన తర్వాత ఆఫీసు తీసివేయలేదని , యార్లగడ్డ వెంకట్రావు లాగా ఇంట్లో దాక్కోలేదని వంశీ సెటైర్లు వేశారు. యార్లగడ్డ వెంకట్రావుకు ఉక్కు రోషం ఉంటే సీఎంతో మాట్లాడుకోవాలని ఆయన చురకలంటించారు. 

తనకు సంబంధం లేని సంకల్ప సిద్ధి పై నేను లీగల్ నోటీసు ఇచ్చానని వల్లభనేని వంశీ తెలిపారు. బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టే నోటీసు ఆపానని ఆయన పేర్కొన్నారు. నోటీసు అందుకున్న పట్టాభి రిప్లై ఇవ్వలేదని.. వైసిపి నాయకులను తాను తిట్టలేదని వంశీ స్పష్టం చేశారు. హోటల్ పార్క్ ఎలైట్ లో వైసీపీ నాయకులతో భేటీ అయ్యానని.. యార్లగడ్డ వైపు ఉండండి లేకపోతే తన వైపు ఉండండి అని అడిగానని వల్లభనేని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా గ్రూప్ పెట్టి కొడాలి నానిని, తనను విమర్శిస్తున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu