
ఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. సోమవారం గుంటూరు (guntur) జిల్లాలోని నరసరావుపేట (narasarao peta)లో విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. 24 నెలల ప్రొఫీషనరీ పీరియడ్ ను పూర్తి చేసుకున్న తమను వెంటనే రెగ్యులర్ (reguler)_చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ (municipal commissioner) ఆర్డీవో (rdo), ఎంపీడీవో (mpdo)కు వినతిపత్రం అందించారు. అలాగే కృష్ణా (krushna) జిల్లాలోని నూజివీడు (nuziveedu)లో సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించారు.
ఈ నిరసన సందర్భంగా ఉద్యోగులు మాట్లాడారు. మూడు నెలల క్రితమే తమ ప్రొఫెషన్ డిక్లేర్ చేయాల్సి ఉందని అన్నారు. అయినా ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం ఆ పని చేయలేదని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే రూ. 15 వేల జీతంతో పని చేయడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. పెళ్లైన వారికి ఈ జీతం ఎటూ సరిపోవడం లేదని అన్నారు. ఈ జీతంతో వారి జీవితం గడవడం చాలా కష్టంగా ఉందని అన్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ సీఎ వైఎస్ జగన్ (ap cm ys jagan) చెప్పిన విధంగా తమను రెగ్యులర్ చేసి జీతాలు చెల్లించాలని అన్నారు. నిరసన అనంతరం అనంతరం ఆర్డీవో రాజ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన సందర్భంగా ఆర్డీవో రాజ్యలక్ష్మి మాట్లాడారు. ప్రజలకు సేవలందించాల్సిన ఉద్యోగులు ఇలా నిరసనలు తెలపడం సరైంది కాదని అన్నారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు కలెక్టర్ (collector) దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు నిరసన విరమించారు.
ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1.34 లక్షల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించింది. గతేడాది అక్టోబరు (octobar) 2తో తొలుత విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల సర్వీసు పూర్తైంది. దీంతో వారు ప్రొబేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వారిని రెగ్యులర్ చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు ఇలా ఆందోళన బాట పడుతున్నారు. తమను రెగ్యులర్ చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు గతేడాది నుంచి నిరసనలు చేపడుతున్నారు.
బయోమెట్రిక్ (biometric) మెషీన్ల లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని, అలా చేయకుండా ఉద్యోగుల జీతాల్లో కోత విధించకూడదని తెలిపారు. ఈ విషయంలో పలు మార్లు మండల, జిల్లా స్థాయి అధికారులకు వినతిపత్రాలు అందించారు. బయోమెట్రిక్ హాజరు యాప్‌తో సంబంధం గతంలో ఇచ్చినట్టుగానే జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు.