గుంటూరు: వివాహేతర సంబంధం... ప్రేమించి పెళ్లాడిన భర్తను దారుణంగా చంపిన భార్య

Arun Kumar P   | Asianet News
Published : Jan 10, 2022, 04:17 PM ISTUpdated : Jan 10, 2022, 04:45 PM IST
గుంటూరు: వివాహేతర సంబంధం... ప్రేమించి పెళ్లాడిన భర్తను దారుణంగా చంపిన భార్య

సారాంశం

వివాహేతర సంబంధం పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న భర్తనే భార్య అతి కిరాతకంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు: మరో యువకుడితో వివాహేతర సంబంధం (illegal affair) పెట్టుకుని కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా హతమార్చిన ఘటన గుంటూరు జిల్లా (guntur district)లో చోటుచేసుకుంది. రెండురోజుల క్రితమే మహిళ భర్తను హతమార్చగా ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పొన్నూరు భావన్నారాయణ కాలనీకి చెందిన నాగరాజు(ఆది) - సోని భార్యాభర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. వివాహం తర్వాత రెండేళ్లపాటు హైదరాబాద్ లో నివాసముండగా గత ఆరేళ్లుగా గుంటూరులో నివాసముంటున్నారు. 

అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదుగానీ నాగరాజు రెండురోజుల క్రితం మృతిచెందాడు. అయితే ఇప్పటివరకు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రెండురోజుల తర్వాత భర్త బంధువులకు సమాచారమిచ్చింది. దీంతో వారు అనుమానం పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని స్వాదీనం చేసుుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న సోని భర్త నాగరాజు అడ్డు తొలగించుకోవాలని చూసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం మరికొందరితో కలిసి భర్తను హతమార్చినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సోనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలావుంటే తెలంగాణలో ఇలాగే అక్రమసంబంధానికి ఓ యువకుడు బలయ్యాడు. తన భార్యతో అక్రమ సంబంధాన్ని నెరుపుతున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని ట్రాక్టర్ తో తొక్కించి అత్యంత కిరాతకంగా హత్యచేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 
 
హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామానికి చెందిన మహేష్ (30) రైతు. గ్రామ సమీపంలోని గూబగుట్టకు వెళ్లే దారిలో తన అన్న నాగరాజు పొలంలో నాట్లు వేసే పనిలో అతడు పాల్గొన్నాడు. నాట్లు ముగిసిన తర్వాత కూలీలను స్వగ్రామంలో దింపడానికి నాగరాజు ట్రాక్టర్ తీసుకుని వెళ్ళాడు.    

ఇదే సమయంలో గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు టూ వీలర్ పై ఒంటరిగా వెళ్తుండగా నాగరాజు గమనించాడు. ఇది వరలో వారిద్దరికీ ఉన్న పాత కక్షలు గుర్తుకువచ్చాయి. దీంతో ఒంటరిగా  దొరికిన మహేష్ పై నాగరాజు పగ తీర్చుకోవచ్చనుకున్నాడు. ఈ నేపథ్యంలో  ట్రాక్టర్ ను వేగంగా పోనిచ్చి మహేష్ టూవీలర్ ఢీకొట్టాడు. దీంతో మహేష్ ద్విచక్ర వాహనంతో సహా పక్కనే ఉన్న దమ్ము చేసిన మడిలో పడిపోయాడు. అతను అంతటితో ఆగలేదు. మడిలో పడిపోయిన అతనిపై నుంచి ట్రాక్టర్ ను తోలాడు. బండితో సహా మడిలో తొక్కించాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మరణించాడు. 

మహేష్ చనిపోయిన తరువాత కానీ.. తానేం చేశాడో అతనికి అర్థం కాలేదు. వెంటనే ట్రాక్టర్ ను బైటికి తీసి.. ఘటనాస్థలానికి కొద్దిదూరంలో ట్రాక్టర్ ను వదిలేసి పారిపోయాడు. ఇక ఆ రాత్రి  విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. బుధవారం ఉదయం అటువైపు వచ్చిన రైతులు మడిలో శవం ఉండడం గమనించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.  పోలీసుల  విచారణలో పలు అంశాలు వెలుగు చూశాయి.

ట్రాక్టర్ డ్రైవర్ నాగరాజు భార్యకు మహేష్ తో వివాహేతర సంబంధం ఉందని.. ఇదే విషయంపై నాలుగేళ్ల కిందట గ్రామంలో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టించారని తెలిసింది. ఆ తర్వాత సమస్య సద్దుమణిగినా.. ఇటీవల మళ్లీ తన భార్య  జోలికి  మహేష్  వస్తున్నాడని అనుమానం పెంచుకున్న సదరు వ్యక్తి  ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: జనసేన సభ్యుడు కుటుంబాన్నిపరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ | Asianet Telugu