ఏపీ రాష్ట్ర మంత్రి పేర్నినానితో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశం ముగిసిన తర్వాత వర్మ సోమవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
అమరావతి: సినీ నటులుBalakrishna , Pawan Kalyan లను టార్గెట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గించిందని తాను అనుకోవడం లేదని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చెప్పారు.
సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంపై ఏపీ మంత్రి Perni Nani కి దర్శకుడు Ramgopal Varma ప్రశ్నలు సంధించారు. వర్మ ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కూడా సమాధానమిచ్చారు. ట్విట్టర్ వేదికగా ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే ఈ విషయమై చర్చించేందుకు తనకు సమయం ఇవ్వాలని రామ్‌గోపాల్ వర్మ మంత్రి నానిని కోరారు. దీంతో ఇవాళ మంత్రి నాని వర్మకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అమరావతిలో ఏపీ మంత్రి పేర్నినానితో రామ్‌గోపాల్ వర్మ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. Tollywood Cinema సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.
ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రపీ శాఖ మంత్రి పేర్ని నానితో సమావేశం ముగిసిన తర్వాత సోమవారం నాడు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడారు.Cinema Tickets టికెట్ల ధరల తగ్గింపుతో సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. మత్రి పేర్ని నానితో జరిగిన చర్చలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. టికెట్ల ధరల తగ్గింపుతో వచ్చే సమస్యలను కూడా ప్రభుత్వానికి వివరించానని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు.
సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా చెప్పారు.సీనీ రంగంలో తనకు ఉన్న అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందోననే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చానని ఆయన తెలిపారు. టికెట్ల ధరలు తగ్గిస్తే సినీ పరిశ్రమకు భారీగా నష్టం వచ్చే విషయాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చానని వర్మ తెలిపారు.రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో తాను ఏకీభవించడం లేదన్నారు.
ఫిల్మ్ మేకర్ గా తన అభిప్రాయాన్ని తాను చెప్పానన్నారు. తాను ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల తరపున చర్చలకు రాలేదని వర్మ స్పష్టం చేశారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టుగా వర్మ అభిప్రాయపడ్డారు. సినిమా థియేటర్ల మూసివేత అంశం తనకు సంబంధించింది కాదని ఆయన చెప్పారు.
తాను ప్రభుత్వానికి సినీ రంగంలోని సమస్యలపై సమగ్రంగా వివరించానని వర్మ తెలిపారు. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై తాను లోతుగా సమాచారం ఇచ్చానని చెప్పారు. మంత్రి పేర్నినానితో జరిగిన సమావేశం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు.
ప్రభుత్వానికి తాను లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి తాను విపులీకరించేందుకు మంత్రి నానితో భేటీ అయ్యాయన్నారు. తన నుండి ప్రభుత్వం అభిప్రాయాలను విందని దర్శకుడు వర్మ చెప్పారు. ఒక్క సమావేశంతోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తోందని తాను భావించడం లేదన్నారు. సినీ పరిశ్రమలో తానొక్కడినే లేనన్నారు. ప్రభుత్వం అన్ని రకాల కోణాల్లో తాను వివరించిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని వర్మ అభిప్రాయపడ్డారు.సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశానికి సంబంధించి తాను ముగింపు ఇవ్వలేనని చెప్పారు. ఈ అంశానికి ముగింపు చెప్పాల్సింది ప్రభుత్వమేనని వర్మ తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై సినీ ప్రముఖులు స్పందించారు., సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని సినీ ప్రముఖులు చెప్పారు. సినిమా టికెట్ల ధరలను పెంచాలని సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు.
సామాన్యుడికి సినిమా వినోదమని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. సామాన్యుడికి సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను సినిమా టికెట్ల ధరలను తగ్గించామని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో సామాన్యుడికి ప్రయోజనం కలుగుతుందని జగన్ సర్కార్ చెబుతుంది.